Naga Chaitanya- Sai Pallavi Diwali Special Poster From Love Story Film

Naga Chaitanya Sai Pallavi Love Story: అక్కినేని నాగ చైతన్య మరోసారి పెళ్లి పీటలపై కనిపించి ఆశ్చర్యపర్చారు. దర్శకుడు శేఖర్ కమ్ముల కొత్త చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫిదాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సాయిపల్లవి.. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగచైతన్యతో ‘లవ్స్టోరీ’ అనే సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీపావళి కానుకగా ‘లవ్ స్టోరీ’ మూవీ నుంచి ఈ స్పెషల్ ఫోటో షేర్ చేస్తూ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.

పెళ్లి దుస్తుల్లో నాగ చైతన్య- సాయి పల్లవిలను అలా పెళ్లి పీటలపై చూసి మురిపోతున్నారు నెటిజన్లు. కొందరైతే ఇంకాస్త ముందడుగేసి ‘సమంతతో జాగ్రత్త సాయి పల్లవి’ అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే ఈ పోస్టర్‌తో పండగ వేళ స్పెషల్ ట్రీట్ ఇచ్చారనే చెప్పుకోవాలి. అన్ని అనుకున్నట్టు జరిగితే గత వేసవిలోనే సినిమా విడుదలయ్యేది. కానీ కరోనా లాక్డౌన్ దెబ్బకు సినిమా ఆగిపోయింది. చివరకు లాక్డౌన్ నిబంధనలు పూర్తయ్యాక షూటింగ్ మొదలుపెట్టారు. ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తయినట్టు సమాచారం. కానీ ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సాంగ్ పోస్టర్లు ఫుల్ వైరల్ అయ్యాయి.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. అతిత్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sai Pallavi special poster from Naga chaitanya Love Story Movie