Naga Chaitanya, Sai Pallavi , sekhar kammula,
Naga Chaitanya, Sai Pallavi , sekhar kammula,
Naga Chaitanya, Sai Pallavi , sekhar kammula,
Naga Chaitanya, Sai Pallavi , sekhar kammula,

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తరువాత మళ్ళీ మజిలీ తో భారీ సక్సెస్ అందుకున్నాడు నాగ చైతన్య.తన గత సినిమాల పరాజయాల ఫలితాలు రివ్యూ చేసుకుని చాలా జాగ్రత్తగా కొత్త సినిమాలు ఎంచుకుంటున్నాడు.చైతూ సినిమా ఫెయిల్ అయినా కూడా మార్కెట్ దెబ్బ తినకుండా ఒక మంచి ప్రయత్నం అనిపించుకుంటూ వస్తుండడం వల్ల మీడియం రేంజ్ హీరోల్లో బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాడు.

అలాగే ఎదో ఒక ఇమేజ్ అంటూ లేకపోవడం వల్ల కూడా డైరెక్టర్స్ చూపు అతనివైపే వెళుతుంది.ప్రస్తుతం చైతూ లైన్ అప్ చేసిన సినిమాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.అవన్నీ పర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ అయితే నాగచైతన్య నెక్స్ట్ రేంజ్ హీరోగా ప్రోమోట్ అయినట్టే.ప్రేమమ్ లో కొన్ని నిమిషాల పాటు మేనమామ వెంకీ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్ ఇప్పుడు అతనితో కలిసి వెంకీమామ అనే కనెక్టింగ్ టైటిల్ తో మల్టీ స్టారర్ చేస్తున్నాడు.దాని తరువాత నాగార్జున డ్రీం ప్రోజెక్ట్ బంగార్రాజు లో కూడా కీలకపాత్ర పోషిస్తున్నాడు.యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో UV క్రియేషన్స్ సినిమా వెయిటింగ్ లో ఉంది.సాహో బిగ్ టాస్క్ వల్ల అది లేట్ అవుతుంది.ఇక దిల్ రాజు కూడా చైతూ తో సినిమా లైన్ అప్ చేసే పనిలో ఉన్నాడు.

ఇలా ఇప్పటికే ఏడాదికి పైగా కమిట్మెంట్స్ తో ఉన్నాడు చైతూ.వీటిలో ఏ ఒక్కటి కూడా ఏ విధంగాను తక్కువ చేసి చూడలేని ప్రాజెక్ట్స్.అయితే ఈ మధ్యలో మళ్ళీ టేస్ట్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నాగ చైతన్య తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.అలాగే హీరోయిన్ గా సాయి పల్లవి ఆల్మోస్ట్ ఫైనల్.ఆల్రెడీ ఒక సినిమా చేస్తూ దానికి ఒక మూడు నెలలు గ్యాప్ రావడంతో ఈ సినిమా చేస్తాడు అని అంటున్నారు.అంటే శేఖర్ కమ్ముల ఫుల్ ప్లెడ్జెడ్ స్క్రిప్ట్ తో రెడీ గా ఉన్నట్టే.పైగా దిల్ రాజు తో ఫిదా అనే బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కాబట్టి దిల్ రాజు బ్యానర్ లో ఆ సినిమా చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.ఫిదా తో వరుణ్ తేజ్ కెరీర్ పీక్స్ కి చేరుకుంది.ఇప్పుడు చైతూ కి కూడా అలాంటి హిట్ దక్కే అవకాశాలున్నాయి.అయిదు సినిమాలు చైతూ చేతిలో ఉన్నాయి.ఈ ఐదు సినిమాల తరువాత చైతూ కెరీర్ గ్రాఫ్ పెరగడం,అతని మార్కెట్ మరింత expand అవ్వడం మాత్రం ఖాయం.