Naga Chaitanya, Samantha Akkineni ,Majili Movie , Telugu Movie Reviews,
Naga Chaitanya, Samantha Akkineni ,Majili Movie , Telugu Movie Reviews,

విడుదల తేదీ : ఏప్రిల్ 05, 2019
రేటింగ్ : 3.25/5
నటీనటులు : సమంత, నాగ చైతన్య, దివ్యంశ కౌశిక్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి త‌దిత‌రులు.
దర్శకత్వం : శివ నిర్వాణ
నిర్మాత : సాహు గారపాటి , హరీష్ పెద్ది
సంగీతం : గోపి సుందర్, తమన్

పెళ్ళికి ముందే మూడు సినిమాలు చేసి రెండు హిట్స్ కొట్టి సూపర్ హిట్ జోడి అనిపించుకున్న నాగ చైతన్య ,సమంత పెళ్లి తరువాత మళ్ళీ పెళ్లి తర్వాత ఒక సినిమా కోసం ఆన్ స్క్రీన్ పై పెయిర్ అప్ అవుతున్నారు అనగానే ఆ సినిమాలో ఎదో విశేషం ఉండే ఉంటుంది అనే మాట మజిలీ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే వినిపించింది.ఇక ఈ సినిమా టీజర్ తో సినిమా కాన్సెప్ట్ ని,ట్రైలర్ తో కథని చెప్పేసిన శివ నిర్వాణ సినిమాపై అంచనాలు కూడా పెంచాడు.అలా నో ఎక్స్పెక్టేషన్ నుండి పీక్ ఎక్స్పెక్టేషన్స్ వరకు సాగిన ఈ మజిలీ ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చింది.మరి ఈ మజిలీ కి విజయం దక్కిందా? లేదా? అనేది ఇప్పడు చూద్దాం.

కథ: 

పూర్ణ(నాగ చైతన్య) వైజాగ్ రైల్వే జోన్ టీమ్ లో క్రికెటర్ గా సెలెక్ట్ అవ్వాలని ప్యాషన్ తో క్రికెట్ ఒక్కటే తన గోల్ గా పెట్టుకుంటాడు.ఆ టైం లో అతనికి అన్షు(దివ్యాన్ష) పరిచయం అవుతుంది.అనుకోకుండా ఇద్దరు లవ్ లో పడతారు.ఒకరినివిడిచి ఒకరు ఉండలేని స్టేజ్ లో పూర్ణ కి అన్షు దూరం అవుతుంది.దాంతో క్రికెట్ కూడా వదులుకుని తాగుబోతుగా మారతాడు పూర్ణ.అయితే ముందు నుండి పూర్ణ ని ప్రేమిస్తున్న శ్రావణి(సమంత) అతన్నే పెళ్లి చేసుకుంటుంది.ఇష్టంలేకుండానే శ్రావణి ని పెళ్లిచేసుకున్న పూర్ణ ఎప్పుడూ ఆమెని భార్యగా చూడడు.అయితే ఉద్యోగం కోసం అని డెహ్రాడూన్ వెళ్లిన పూర్ణ అక్కడినుండి మీరా అనే పాపను తీసుకువస్తాడు.అసలు ఆ పాప ఎవరు?,ఆమె వచన తరువాత పూర్ణ,శ్రావణి ల జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి,చివరి ఆ ఇద్దరూ ఒకరికి ఒకరు ఎలా దగ్గరయ్యారు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ: 

వినడానికి సింపుల్ పాయింట్ లా ఉన్న మల్టీ లేయర్డ్ కథని శివ నిర్వాణ చాలా హానెస్ట్ వే లో చెప్పాడు.డైలాగ్స్ తోనే కథను లీడ్ చేస్తూ ఆ సింగిల్ పాయింట్ నే చాలా ఇంట్రెస్టింగ్ గా మలిచాడు.అయితే ఫస్ట్ హాఫ్ వరకు క్రికెట్,లవ్ సీన్స్ మిక్స్ అప్ తో అక్కడక్కడా కామెడి వర్క్ ఔటింగ్ తో చకచకా సాగిపోయినట్టు అనిపించింది.కొత్తదనం లేకపోయినా ఎక్కడా బోర్ కొట్టినట్టు అనిపించదు.ఇంటర్వెల్ లో సమంత ఎంట్రీ ఇవ్వడంతో సెకండ్ హాఫ్ మీద చాలా హోప్స్ ఉంటాయి.

అయితే సెకండ్ హాఫ్ లో నెర్రెషన్ కొద్దిగా స్లో గా అనిపించినా,పేలుతుంది అనుకున్న ట్విస్ట్ కొద్దిగా అన్ నేచురల్ గా అనిపించినా,ప్రీ క్లయిమాక్స్ నుండి సినిమాటిక్ లిబర్టీ కాస్త ఎక్కువయినా కూడా నటీనటులు,సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ కలిసి నిలబెట్టేశాయి.ట్రైలర్ ఉన్న ఎమోషనల్ డోస్ సినిమాలో కూడా కనిపిస్తుంది.కేవలం ఫామిలీస్ కే కాకుండా కొన్ని యూత్ అప్పీలింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.కొద్దిగా స్లో గా ఉన్నా కూడా సందర్భానుసారం డెప్త్ తో కూడిన డైలాగ్స్ వల్ల ఎమోషన్ క్యారీ అయ్యింది.ఇక శివ నిర్వాణ సటిల్ కామెడీ సెన్సిబిలిటీస్ కూడా ఆకట్టుకున్నాయి.

నటీనటులు: 

చైతన్య కి బలహీనతలు ఎన్ని ఉన్నా కూడా హానెస్ట్ గా కనిపించడం,ఎమోషన్ ని పండించడం అనేది అతని బలం.ఆ బలాలతోనే ఈ సినిమాలో పూర్ణ క్యారెక్టర్ ని అద్భుతంగా పండించాడు చైతు.లైఫ్ లోని రెండు ఫేజ్ ల మధ్య ఉన్న డిఫరెన్స్ బాగా చూపించగలిగాడు.గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అతని నటన మరింతగా మెరుగుపడింది.

సమంత పాత్ర,ఆ పాత్రలో ఆమెని నటన మజిలీ కి మెయిన్ ఎస్సెట్.మిగతావాళ్ళు ఎవరయినా చేస్తే ఆ పాత్ర మామూలుగా మిగిలిపోయేదేమో.కానీ సమంత చెయ్యడంవల్ల అది చాలా కనెక్టింగ్ గా అనిపించింది.అలాగే ఆమె కామెడీ టైమింగ్ కూడా చాలా డీసెంట్ గా ఉంది.దివ్యాన్ష క్యారెక్టర్ లో నటన కి పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో ఆమె డీసెంట్ గా నటించింది.చైతు అండ్ దివ్యాన్ష పెయిరింగ్ కూడా క్యూట్ గా ఉంది.

హీరో ఫ్రెండ్స్ గా నటించిన సుదర్శన్ అండ్ సుహాస్ లకు మంచి స్కోప్ ఉన్న పాత్రలు దక్కాయి.ఇక రావు రమేష్,పోసాని లు తమకు అలవాటయిన పాత్రలను బాగా పండించారు.అతుల్ కులకర్ణి,సుబ్బరాజు,రవి ప్రకాష్ లాంటి సీనియర్ నటుల ప్రెజెన్స్ వల్ల సినిమా కాన్వాస్ పెరిగింది.

టెక్నీషియన్స్: 

మజిలీ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం అనే కీలకమయిన నాలుగువిభాగాలు డీల్ చేసిన శివ నిర్వాణ తన సెన్సిబిలిటీస్ ని మరోసారి డీసెంట్ గా ప్రెసెంట్ చేసాడు.చాలా చిన్న పాయింట్ ని మల్టీ లేయర్డ్ గా అల్లుకున్నాడు.మామూలుగా అయితే ఇది ఒక రొటీన్ థ్రెడ్.కానీ శివ దానికి ప్రెసెంట్ చేసిన విధానం కొత్తగా ఉంది.ఫస్ట్ హాఫ్ వరకు పెద్దగా కంప్లైంట్ లేకుండా సాగిన మజిలీ సెకండ్ హాఫ్ లో కాస్త ల్యాగ్స్ తో,కాస్త సినిమాటిక్ గా అనిపించింది.

క్లయిమాక్స్ కూడా డెప్త్ తగ్గిన ఫీలింగ్ ఉంటుంది.కానీ శివ నిర్వాణ రాసుకున్న పాత్రలు,ఆ పాత్రల్లో నటులను వాడుకున్న తీరు మెప్పిస్తుంది.డెహ్రాడూన్ ఎపిసోడ్ లో పెట్టిన ట్విస్ట్ చాలా అన్ నేచురల్ గా ఉండడంతో పాటు కాస్త కన్ఫ్యూషన్ కి గురి చేస్తుంది.ఓవర్ ఆల్ గా అయితే మళ్ళీ డీసెంట్ సినిమా డెలివర్ చేసాడు ఈ యంగ్ డైరెక్టర్.ఇక శివ నిర్వాణ తో మంచి ట్యూనింగ్ కుదిరిన గోపిసుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.మూడు పాటలు ఆకట్టుకున్నాయి.థమన్ ఆర్.ఆర్ సినిమాలో ఫీల్ ని బాగా ఎలివేట్ చేసింది.విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ సినిమాకి ఎస్సెట్.ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది.సాహు గార్లపాటి,హరీష్ పెద్ది నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా: 

చైసామ్-4 అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన మజిలీ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని కూడా ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కింది.అక్కడక్కడా కాస్త నెమ్మదిగా సాగినా కూడా ఓవర్ ఆల్ గా మాత్రం మంచి సినిమా చూసిన అనుభూతి కలిగిస్తుంది.కమర్షియల్ గా కూడా మజిలీ మంచి విజయం సాధించే అవకాశాలున్నాయి.

బోటమ్ లైన్:మజిలీ…మంచి ఎమోషనల్ జర్నీ