Naga Chaitanya, Samantha, Majili Movie, Telugu Movie News
Naga Chaitanya, Samantha, Majili Movie, Telugu Movie News

మధ్య మొదలయిన డిజిటలైజేషన్ సినిమాలపై కూడా గట్టి ప్రాభవం చూపుతుంది.ఒక తెలివయిన స్ట్రాటజీతో ప్రొడ్యూసర్స్ కి హై అమౌంట్స్ ఇచ్చి సినిమా డిజిటల్ రైట్స్ కొనుక్కుంటున్న OTT ప్లాట్ ఫార్మ్స్ నెల తిరక్కముందే సినిమాని అందరికి ఒక మౌస్ క్లిక్ దూరంలోకి తెచ్చేస్తున్నాయి.దీంతో సినిమా బావున్నా కూడా చాలామంది ఇంట్లో కూర్చుని సినిమా చూడడానికే ప్రిఫరెన్సు ఇస్తున్నారు.

రంగస్థలం,F2 ..ఇలా కొన్ని సినిమాలు డిజిటల్ వెర్షన్ రిలీజ్ కావడంతో బలవంతంగా థియేటర్స్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.ఒక మోస్తరు సినిమాల పరిస్థితి ఇక చెప్పక్కర్లేదు.డిజిటల్ నెల రోజుల్లో ప్రేక్షకులకి అందుబాటులోకి వస్తుండడంతో తాము నష్టపోతున్నామంటూ సాటిలైట్ ఛానెల్స్ కూడా 50 రోజుల్లో సినిమాని టెలికాస్ట్ చేసేస్తున్నాయి.దీంతో థియేటర్ లో సినిమా స్పాన్ తగ్గిపోతుంది.ఇలా కళ్లెం లేకుండా వెళుతున్న వ్యవస్థను మార్చకపోతే ముందు ముందు సినిమాలకు ముప్పు తప్పదు అని అంతా అనుకున్నారు.ఎవరో పెద్దవాళ్ళు పూనుకుని సిట్యుయేషన్ మార్చాలి అని అనుకుంటున్న టైం లో విచిత్రంగా మజిలీ అమెజాన్ కి బ్రేక్స్ వేసింది.

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం దక్కించుకున్న సినిమా రెండు నెలల వరకు డిజిటల్ వెర్షన్ రిలీజ్ కాకుండా ఉండేలా చూసుకున్నారు,దీంతో ఇంకా థియేటర్స్ లో మజిలీకి మంచి వసూళ్లు దక్కుతున్నాయి.రెండు నెలలు అనేది కాస్త ఎక్కువ టైం కావడంతో ప్రేక్షకులు కూడా థియేటర్స్ వైపు కదులుతున్నారు.మజిలీ వల్ల జెర్సీ తో పాటు మిగతా సినిమాలకు కూడా మేలు జరుగుతుంది.త్వరలో రిలీజ్ కాబోతున్న మహర్షి లాంటి పెద్ద సినిమాలకు కూడా ఇది మేలు చేసే పరిణామమే.మొత్తానికి మజిలీ చైతు గీతనే కాదు టాలీవుడ్ సినిమాల రాతని కూడా మార్చింది.థాంక్స్ టు సమంత.