Naga Chaitanya Comments on Samantha: సమంత అలాగే నాగచైతన్య విడిపోయి రెండు సంవత్సరాలు అయినప్పటికీ సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి పైన ఏదో ఒకటి న్యూస్ ప్రచారం జరుగుతూనే. అయితే సమంత మీద చాలా రకాలుగా నెగిటివ్ ప్రచారం జరిగినప్పటికీ నాకు చైతన్య కూడా దానిమీద ఎప్పుడు ఎలాంటి కామెంట్ చేయడం జరగలేదు. సమంత చైతన్య విడిపోయిన తర్వాత ఎవరి జీవితం వాళ్లు బిజీగా గడిపేస్తున్నారు. నాగచైతన్య తన సినిమా లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నారో అదే విధంగా సమంత కూడా ఒకపక్క సినిమాలు చేసుకుంటూ మరోపక్క వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు.
Naga Chaitanya Comments on Samantha: ఇటీవల మయోసిటిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు సమంత సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. సినిమాల విషయానికొస్తే, సమంత (Samantha) ఈ సంవత్సరం శాకుంతలం సినిమా విడుదల చేయగా అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.
తన కొత్త సినిమా కస్టడీ (Custody) మూవీ ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. చైతు (Naga Chaitanya) ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా పాల్గొంటున్నారు. అయితే ఒక మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య తన రాబోయే సినిమాల గురించి అలాగే పర్సనల్ లైఫ్ గురించి అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వడం జరిగింది.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ సమంతాతో విడాకులు తీసుకున్న తర్వాత మీ జీవితం ఎలా ఉంది అనే ప్రశ్నకి నాగచైతన్య (Naga Chaitanya) షాకింగ్ కామెంట్స్ (Comments) చేయడం జరిగింది. ఈ ప్రశ్నకి నాగచైతన్య సమాధానమిస్తూ ” నేను అలాగే సమంత (Samantha) ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా గడిపేస్తున్నాము.. సమంత చాలా మంచి అమ్మాయి.. తనకి అంతా మంచే జరగాలి.. మేము విడాకులు తీసుకోవడానికి వంద కారణాలు ఉండవచ్చు.. కానీ మా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి గౌరవం ఇప్పటికీ అలాగే ఉంది… సోషల్ మీడియాలో కొన్ని వెబ్ చానల్స్ లో ప్రచారంలో ఉన్న న్యూస్ ఎవరు నమ్మవలసిన అవసరం లేదు.. అలా అని ప్రతి ఒక్కదానికి నేను సమాధానము ఇవ్వవలసిన అవసరం కూడా నాకు లేదు.. అంతేకాకుండా మా ఇద్దరి మధ్య ఎటువంటి శత్రుత్వం కూడా లేదు” అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రతి ఒక్క ప్రచారానికి సమాధానం ఇవ్వటం జరిగింది.
ఇక నాగచైతన్య సినిమా విషయానికి వస్తే, కస్టడీ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రజల ముందుకు రాబోతుంది, కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటించారు. ఈరోజు విడుదలైన కస్టడీ ట్రైలర్ సినిమాపై భారీ అంచునాలను ఏర్పడేటట్టు చేశాయి.
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలంటూ నాగచైతన్య ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేయడం జరుగుతుంది. మే 12న కస్టడీ మూవీని తెలుగు అలాగే తమిళంలో ఒకేసారి విడుదల చేస్తున్నారు మేకర్స్. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ కస్టడీ మూవీ అలాంటి ఫలితాన్ని ఇస్తుందో మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది.
Web Title: Naga Chaitanya Socking Comments on Samantha in Custody movie interview