Naga Chaitanya strong counter to Balakrishna: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చరిత్రల గురించి మాట్లాడే వాళ్లు చాలామంది ఉన్నారు. వారిలో నందమూరి బాలకృష్ణ ఒకళ్ళు. ఇటీవల జరిగిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్లో బాలకృష్ణ అక్కినేని నాగేశ్వరరావు పై సంచలమైన కామెంట్ చేయడం జరిగింది. అయితే దీనికి కౌంటర్ కాదు నాగ చైతన్య అలాగే అఖిల్ రెస్పాండ్ అయ్యారు.
Naga Chaitanya- Balakrishna: ఈరోజు నాగచైతన్య అలాగే అఖిల్ ట్విట్టర్ వేదికగా ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేయడం జరిగింది. దీనిలో తన తాత అక్కినేని నాగేశ్వరరావును అగౌరవపరిచారంటూ నందమూరి బాలకృష్ణపై ఆయన ఓ ప్రకటనలో పరోక్ష దాడి చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ తన ప్రసంగంలో అక్కినేనిని తొక్కినేని అని సంబోధించారు.
దీనికిగాను నాగచైతన్య ప్రెస్ నోట్లో ఇలా రాయడం జరిగింది ”నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అలాగే ఎస్వీ రంగారావు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరచుకోవడం”.
తన తండ్రి నాగార్జున మౌనంగా ఉండగా, నాగ చైతన్య అలాగే అఖిల్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బాలకృష్ణ దీనిపై ఎలా స్పందిస్తారు వేచి చూడాలి.
— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023