Naga Chaitanya: హైదరాబాద్‌లో ‘థ్యాంక్‌ యూ’ షూట్‌

0
28
Naga Chaitanya Thank you final schedule start from July in hyderabad

Thank you Movie: అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తోన్న చిత్రం థ్యాంక్యూ. విక్ర‌మ్ కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలోరాశీ ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్‌ కథానాయికలు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీమ్ ఇటలీ వెళ్లి అక్కడ కొంతవరకూ షూటింగు పూర్తిచేసుకుని వచ్చింది.

ఇప్పుడు హైదరాబాద్‌లో ఆఖరి షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ వారాంతంలోనే ఈ షూట్‌ మొదలు కానుంది. ప్రస్తుతం మరో ఐదు రోజుల చిత్రీకరణే మిగిలి ఉందని.. ఇందులో భాగంగా చైతూతో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని సమాచారం. సినిమా విడుదలపై ఆగస్టులో స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.