‘థ్యాంక్యూ’ తో అలరించేందుకు సిద్ధమైన అక్కినేని హీరో..!

0
1340
Naga chaitanya three different getups in Thank you film

Thank You: అక్కినేని ఫ్యామిలీ హీరోలు వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నాగార్జున ప్రస్తుతం ఘోస్ట్ అనే సినిమాతో పాటు బంగార్రాజు అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇక అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకి సిద్ధం కాగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఏజెంట్ సెట్స్ పై ఉంది.

ఇక నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమా రూపొందుతోంది. ఆ మధ్య ఇటలీ వెళ్లి కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా చిత్రీకరించుకుని వచ్చారు. అక్కడి అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని కూడా చెప్పారు. ఈ సినిమాలో చైతూ జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉందని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో చైతూ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నట్టు చెబుతున్నారు. అంటే వయసు పరంగా ఆయన మూడు దశలలో కనిపిస్తాడని చెబుతున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Naga Chaitanya Thank you movie shooting pics

ఇక చైతూ తాజా చిత్రంగా త్వరలో ‘లవ్ స్టోరీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ సినిమా షూటింగులోను పాల్గొన్నాడు.

 

Previous article‘భీమ్లా నాయక్’ నుంచి ఫస్టు సింగిల్..!
Next articleMegha Akash Stunning Pics