Naga Chaitanya’s new film titled Thank You

టాలీవుడ్ మన్మథుడు బర్త్ డే పురస్కరించుకుని అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు నాగ్ తనయుడు అక్కినేని నాగచైతన్య. ‘మనం’ చిత్రంతో అక్కినేని ఫ్యామిలీకి ఎవర్ గ్రీన్ చిత్రం అందించిన విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు నాగచైతన్య. ఈ చిత్రానికి ‘థాంక్యూ’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు.

ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ‘మనం’ తర్వాత నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్. ఇష్క్ సినిమాతో టాలీవుడ్ లో మంచి హిట్ కొట్టిన విక్రమ్.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ నాగార్జునకు బర్త్ డే విషెష్ అందించారు నాగార్జున. అంతకుముందు వీరి కాంబినేషన్ లో జోష్ అనే సినిమా తెరకెక్కింది. నాగచైతన్యకి ఇది 20వ సినిమా కావడం విశేషం.. త్వరలోనే నటీనటులను ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ‘లవ్ స్టోరీ’ అనే చిత్రంలో చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో చైతూ సరసన సాయి పల్లవి నటిస్తోంది.