‘నాగ శౌర్య , రీతువర్మ’ ‘వరుడు కావలెను‘ టీజర్ విడుదల

0
166
Naga Shaurya and Ritu Varma Varudu Kaavalenu Teaser out

Varudu Kaavalenu Teaser: నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ దర్శకత్వంలో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘. నేటి (31-8-2021) ఉదయం 10.08 నిమిషాలకు ‘వరుడు కావలెను‘ చిత్రం టీజర్ ను విడుదల చేసి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సితార ఎంటర్ టైన్మెంట్స్.

ముందు నుంచి కూడా మంచి బజ్ ఉన్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఈ టీజర్ చాలా ప్లెజెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. రీతూ వర్మ రోల్ ని ఆసక్తికరంగా ఈ టీజర్ లో ప్రెజెంట్ చేశారు. 30 వచ్చినా ఇంకా పెళ్లి అంటే ఇంట్రెస్ట్ చూపని అమ్మాయికి వరుడుగా శౌర్య ఏం చేసాడు అన్నట్టుగా కట్ చేసిన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది.

ఖచ్చితంగా ‘వరుడు కావలెను‘ చిత్రాన్ని ప్రేమ కథా చిత్రాలలో ప్రత్యేకంగా చూసేలా చేస్తాయి. ఓ ఫీల్ గుడ్ మూవీని చూడ బోతున్నామన్న ఆసక్తిని కలిగిస్తుంది ఈ టీజర్. చివరలో హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు నిర్మాత సూర్యదేవర నాగవంశి తెలపటం కనిపిస్తుంది.

ఇందులో అక్టోబర్ నెలలో చిత్రం ధియేటర్ లలో విడుదల అన్నది స్పష్టం చేశారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన ‘‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా’, అలాగే ‘దిగు దిగు నాగ’ పాటలు బహుళ ప్రజాదరణ పొందినాయి. దీనికి ముందు ఇప్పటివరకు విడుదల చేసిన చిత్రాలు, ప్రచార చిత్రాలు వంటి వాటికి కూడా ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. మరి సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని వచ్చే అక్టోబర్ లో థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.