Naga Shaurya goes on diet and workout for his next NS20

టాలీవుడ్ యువ హీరోల్లో ఫిట్ నెస్ మంత్ర‌ను ఫాలో అయ్యేవారు చాలా మందే ఉన్నారు.ఈ లిస్ట్ లో నాగశౌర్య కూడా ఒక‌డని ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. జిమ్‌లో భారీగానే కసరత్తులు చేస్తున్నాడు. సినిమాలో లుక్‌కు సంబంధించి.. బాడీని అనువుగా మార్చుకునేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన లుక్‌ను ఆయన సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

న‌వ్య‌మైన క‌థాంశాల‌తో కూడిన సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ..ఛాలెంజింగ్స్ రోల్స్ చేస్తూ ప్రేక్ష‌కులకు కొత్త‌దనంతో కూడిన చిత్రాల‌ను అందించేందుకు సిద్దంగా ఉంటాడు. అశ్వ‌త్థామ చిత్రంలో అంద‌రినీ ప‌లుక‌రించిన ఈ యాక్ట‌ర్ త‌న 20వ మూవీ కోసం మేకోవ‌ర్ మార్చుకుంటున్నాడు. సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం కోసం సిక్స్ ప్యాక్ బాడీ లుక్‌లో క‌నిపించేందుకు జిమ్ లో క‌ష్ట‌ప‌డుతున్నాడు నాగ‌‌శౌర్య.

Naga Shaurya NS20 First Look