Naga Shaurya Marriage: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ఒకరైన నాగ శౌర్య త్వరలో తన బ్యాచిలర్‌హుడ్‌కి వీడ్కోలు పలుకనున్నారు. ఇటీవలే కృష్ణ బృందా విహారి తో బాక్సాఫీస్ విజయాన్ని రుచి చూసిన ఈ నటుడు ఈ నెలాఖరులో అనూష అనే బెంగళూరు అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడు.
Naga Shaurya Marriage Date:ఎవరు ఊహించని విధంగా ఒక్కసారిగా నాగశౌర్య పెళ్లి విషయం తెరపైకి వచ్చేటప్పటికీ ఫ్యాన్స్ అందరూ కంగు తిన్నారు. పదేళ్ల నుండి టాలీవుడ్లో తన సినిమా జీవితాన్ని కొనసాగిస్తున్న నాగశౌర్య ఈనెల 20వ బెంగళూరులో అనూష తో (naga shourya wife anusha) మ్యారేజ్ కానుంది.
JW మారియట్ వేదికగా ఉదయం 11:25 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. 19న మెహందీ ఫంక్షన్ ఉండటంతో ఇప్పటి నుంచే నాగశౌర్య ఇంట్లో సందడి నెలకొంది. మెహందీ మరియు వివాహ వేడుకలకు వేర్వేరు దుస్తుల కోడ్‌లు ఉంటాయి.



ఇది ఇలా ఉంటే శౌర్య తదుపరి సినిమాని సుధాకర్ చెరుకూరి ప్రొడక్షన్ వెంచర్ లో వస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌లో కనిపించనున్నాడు. ఇందులో గత చిత్రాల కంటే నాగశౌర్య డిఫరెంట్ గా కనిపిస్తాడని చిత్రబృందం ధీమాగా ఉంది.


