Naga Shaurya Latest Movie Varudu Kavalenu Announced Offcially

Naga Shaurya Varudu Kavalenu:  యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న కొత్త సినిమా ‘వరుడు కావలెను’. కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలను ఓకే చేస్తూ వస్తున్న ఆయన ఈ సినిమాతో సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్రానికి టైటిల్ అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్.. ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసింది.

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగశౌర్య, రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రానికి ‘వరుడు కావలెను‘ అనే పేరును నిర్ణయించారు. ఈ వీడియోలో నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.

ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తెచ్చింది. ‘వరుడు కావలెను’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో నదియా – మురళీశర్మ – వెన్నెల కిషోర్ – ప్రవీణ్ – అనంత్ – కిరీటి దామరాజు – మహేష్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను అతిత్వరలో ప్రకటించనుంది చిత్రయూనిట్.