నాగ శౌర్య ,రీతువర్మ జంటగా ‘వరుడు కావలెను’ పోస్టర్..!

82
Naga shaurya Ritu Varma Varudu Kaavalenu First look poster released

నాగశౌర్య, రీతువర్మ హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటిస్తూ అందమైన వీడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ వీడియో లో నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపించారు. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తేవటమే కాదు ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు కూడా లభించాయి.

కాగా, 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఓ ప్రచారచిత్రం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాగశౌర్య , రీతువర్మ జంట చూడముచ్చటగా కనిపిస్తుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణంపై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ చిత్రంలో ఇంకా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, ‘రంగస్థలం’ మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. గణేష్ కుమార్ రావూరి మాటలు రాస్తున్నారు. కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం లక్ష్మీసౌజన్య.