Naga Shaurya Wedding: టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య హిజయాపజయాలకు అతీతంగా సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఏడాది కృష్ణ వ్రింద విహారి సినిమాతో సక్సెస్ సాధించారు. అనుకోని విధంగా నాగ శౌర్య పెళ్లి చేసుకుంటున్నారు అని ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈరోజు నాగశౌర్య ఇంట ఆ పెళ్లి సందడి మొదలైంది.
Naga Shaurya Wedding Photos: ఇంటీరియర్ డిజైనర్ గా కెరీర్ కొనసాగిస్తున్న అనూష శెట్టి నీ నాగసౌర్య పెళ్లి ఆడుతున్నారు. ఈరోజు వీళ్ళిద్దరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతుండగా, సినీ అలాగే రాజకీయా ప్రముఖులు నాగశౌర్య పెళ్లికి హాజరు కానున్నారు.
వైరల్ అవుతున్న ఫోటోలు, నాగశౌర్య అలాగే అనూష ట్రెడిషనల్ ఔట్ ఫిట్ అలా చూసిన ఫాన్స్ ఫిదా అవుతున్నారు. అలాగే ఇద్దరి జంట బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. నాగశౌర్య భార్య అనూష కీ బెంగళూరులో సొంతంగా ఆఫీస్ ఉన్నదని అలాగే అనూష ఫ్యామిలీ మెంబర్స్ బిజినెస్ రంగంలో ఉన్నారని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది.
మొత్తం మీద టాలీవుడ్ లో ఉన్న బ్యాచులర్స్ లో ఒకళ్ళు పెళ్లి పీటలు ఎక్కడం జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే నాగశౌర్య త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.