ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నాగశౌర్య కొత్త సినిమా ప్రకటన

0
217
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నాగశౌర్య కొత్త సినిమా ప్రకటన
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నాగశౌర్య కొత్త సినిమా ప్రకటన

ఊహలుగుసగుస లాడే అంటూ అందరిని ఊహల్లో తేల్చేసిన హీరో నాగశౌర్య. తన మొదటి సినిమాతోనే పక్కింటి అబ్బాయిలా కనిపించి అందరి ఆదరణను పొందాడు. ఆ తరువాత చలో అని అందరిని థియేటర్ల బాట పట్టించాడు. ఇప్పడు ఈ హీరో తన 20వ సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమా టైటిల్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోంది. దీనికి సంతోష్ గార్లపుడి దర్శకత్వం వహించనున్నారు. దానితోపాటుగా కాలభైరవా సంగీతం ఇవ్వనున్నాడు.

ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్ లుక్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం నాగశౌర్య తెగ కష్టపడ్డాడు. ఇందులో ఎయిట్ ప్యాక్ బాడీతో అందరిని ఆకట్టుకొనేందుకు సిద్దమవుతున్నాడు. ఇందులో కేతికా శర్మ కథానాయికగా నటిస్తోంది. అంతేకాకుండా తెలుగు లేటెస్ట్ విలన్ జగపతిబాబు ఇందులో ఓ కీలక పాత్ర చేయనున్నారు.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అభిమానులను అంచనాలను అందుకుంటే కచ్చితంగా సినిమా భారీ హీట్ అవుతోందని చెప్పుకోవచ్చు. మరి ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకుంటుందో చూడాలి.