Naga Shourya ,Palana Abbayi Palana Ammayi, Ashwathama ,
Naga Shourya ,Palana Abbayi Palana Ammayi, Ashwathama ,

సొంత బ్యానర్ స్టార్ట్ చేసి ఛలో తో సూపర్ హిట్ అందుకున్న నాగ శౌర్య అదే బ్యానర్ లో చేసిన సెకండ్ సినిమా నర్తనశాల తో మాత్రం భారీ ప్లాప్ నమోదు చేసుకున్నాడు.దాన్ని తరువాత కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిన ఒక సినిమా క్యాన్సిల్ చేసుకున్న శౌర్య ఓ బేబీ లో చాలా చిన్న పాత్రలో కనిపించాడు.దాంతో శౌర్య అసలు ఏ సినిమా చేస్తున్నాడు?,కెరీర్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాల్సిన టైం లో ఎందుకు డల్ గా ఉన్నాడు అనే డిస్కషన్స్ నడిచాయి.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఓ బేబీ సక్సెస్ లో తాను కూడా భాగమైనందుకు హ్యాపీ గా ఫీల్ అవుతూ తన నెక్స్ట్ సినిమాల విశేషాలు కూడా వివరించాడు.సొంత బ్యానర్ ఐరా ప్రొడక్షన్స్ లో అశ్వద్దామ అనే సినిమా చేస్తున్న శౌర్య ఆ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ కోసం స్టంట్ చేస్తూ గాయపడడ్డాడు.కానీ ఆ సినిమాకి అది అవసరం అని,కోలుకున్నాక మళ్ళీ ఆ సీన్ షూట్ చేస్తామని తెలిపాడు.ఆ సినిమాకి కథ కూడా నాగ శౌర్య అందించడం విశేషం.గతంలో ఛలో సినిమాకి కూడా కథ అందించిన శౌర్య ఈ సారి క్రెడిట్స్ లో కూడా తనపేరు వేసుకుంటున్నాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఒక పక్క అశ్వద్ధామ చేస్తూనే మరొకపక్క అవసరాల శ్రీనివాస్ తో ఒక సినిమా స్టార్ట్ చేసి ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ కూడా పూర్తిచేసేసాడు.ఆ సినిమాకి ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి అనే పేరు ఖరారు చేసారు.గతంలో నాగ శౌర్య కి ఊహలు గుసగుసలాడే,జో అచ్యుతానంద లాంటి హిట్స్ ఇచ్చిన అవసరాల ఈ సినిమాతో హ్యాట్రిక్ అందిస్తాడు అని నమ్మకంగా ఉన్నాడు.రీసెంట్ గా సుమంత్ తో సుబ్రమణ్యపురం అనే సినిమా చేసి టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సంతోష్ జాగర్లపూడి తో కూడ పార్ధు అనే సినిమా చేస్తున్నాడు.ఈ మూడు సినిమాలు హిట్ అయితే కనుక శౌర్య రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది.నిఖిల్,శర్వా కాస్త డౌన్ లో ఉన్నారు కాబట్టి నాగ శౌర్య కి ఇది లైఫ్ టైం బెటర్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి.దీన్ని అతను ఎంతవరకు ఉపయోగించుకుంటాడు అనేది చూడాలి.

[INSERT_ELEMENTOR id=”3574″]