లక్ష్య తెలుగు సినిమా రివ్యూ రేటింగ్

0
345
Naga Shourya Lakshya Review Rating
Naga Shourya Lakshya Review Rating

Naga Shourya Lakshya Review Rating

రేటింగ్: 2.5/5
తారాగణం: నాగశౌర్య, కేతికా శర్మ, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, రవిప్రకాష్ తదితరులు
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
మాటలు: సృజనామణి
సంగీతం: కాలభైరవ
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి

యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ శౌర్య (Naga Shourya) లేటెస్ట్ సినిమా “లక్ష్య” (Lakshya telugu movie). కిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాకి వేరియేషన్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నాగశౌర్య. కేతిక శర్మ హీరోయిన్ గా సంతోష్ డైరెక్షన్ లో వచ్చిన “లక్ష్య” (Lakshya Review) ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ :
హీరో పార్ధు(నాగ శౌర్య) తన చిన్నప్పటి నుంచే వీలు విద్యలో ఎంతో ప్రతిభతో కూడి ఉంటాడు. దీనితో తనలోని ఆసక్తిని టాలెంట్ ని చూసి తన తాతయ్య (సచిన్ ఖేద్కర్) పార్ధు ని ఎలా అయినా ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని బెస్ట్ అకాడమీ లో జాయిన్ చేస్తాడు. అలా అలా ఆర్చరీ మీద శ్రద్ధ పేట్టి ఛాంపియన్ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు పార్ధు. అక్కడ నుంచి పార్ధు రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ప్లేయర్ గా ఎదుగుతూ జాతీయ స్థాయికి ఎదుగుతున్నాడు.

కానీ అనుకోని కారణాలవల్ల తన తాతయ్య మరణిస్తాడు. అలాగే కేతిక శర్మ ప్రేమలో పడతాడు. ఇలా పార్ధు లైఫ్ హ్యాపీ గా కొనసాగుతున్న సమయంలో లో కొని అనుకొని అడ్డంకులు ఎదురవుతాయి. అస్సలు పార్ధు జీవితంలో జరిగిన అనర్ధాలు ఏమిటి ? అతడు ఆర్చరీలో ఉన్నత శిఖరాలు అందుకుంటాడా లేదా? లాంటివి తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

Lakshya movie review in telugu
Lakshya movie review in telugu

ప్ల‌స్ పాయింట్స్
నాగ శౌర్య, కేతిక శర్మ
ఎమోషనల్ సన్నివేశాలు
క్లైమాక్స్

మైన‌స్ పాయింట్స్
సెకండాఫ్
నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే
తెలిసిన కథనే

విశ్లేషణ:
సినిమా కోసం నాగశౌర్య చాలా కష్టపడ్డారు. ఎయిట్ ప్యాక్ చేశారు. స్క్రీన్ మీద అది కనిపించింది. అతడు పడ్డ కష్టం వృథా కాలేదు. లుక్ పరంగా, బాడీ పరంగా వేరియేషన్ చూపించారు. ఇక హీరోయిన్ కేతిక శర్మ రోల్ కూడా సినిమాలో బాగుంది. తన లుక్స్ పరంగా కానీ శౌర్య తో సీన్స్ లో కానీ మంచి కెమిస్ట్రీ ఇద్దరి మధ్య కనిపిస్తుంది.

Lakshya review rating
Lakshya review rating

డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి కథని బాగా నే రాసుకున్న ప్పటికీ, జరగబోయే సన్నివేశాలు ప్రేక్షకులకు అర్థం అవుతా ఉంటాయి, అలాగే కథలు ఎమోషన్స్ ని ఇంకొంచెం బాగా తీర్చిదిద్ది వుంటే బాగుండేది అనిపిస్తుంది. నాగ శౌర్య అలాగే తాతయ్య ల మధ్య వచ్చే ఎమోషన్స్ బాగా ఆకట్టుకుంటాయి.

నాగ శౌర్య తాతయ్య చనిపోయిన తర్వాత, హీరో డ్రగ్స్ కి అలవాటు అవుతాడు అలాగే పోటీల్లో కూడా పాల్గొని విఫలమవుతాడు. తరవాత హీరోయిన్ మళ్లీ తన లైఫ్ లోకి రావటం అలాగే విలువిద్య పోటీలో ఎలా విజయం సాధిస్తాడో చూపించిన విధానం బాగానే ఉంది.

Lakshya telugu movie review
Lakshya telugu movie review

సినిమాలో నేపథ్యం అంతా కూడా బాగానే అనిపిస్తుంది కానీ తర్వాత తర్వాత ఆ గేమ్ పై చూపించే సన్నివేశాలు, సెటప్ అంతా కూడా అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. అలాగే కొంచెం సింగిల్ గా కూడా అనిపిస్తుంది. చాలా సన్నివేశాలు కాస్త డల్ గా ఏదో అలా సాగుతున్నట్టు అనిపిస్తాయి.

సినిమాలు లో అన్ని ప్రేక్షక వర్గాన్ని ఆకట్టుకునే కథ బాగానే ఉంటుంది కానీ దర్శకుడు సంతోష్ చూపించే విధానం అలాగే స్క్రీన్ ప్లే మిస్ అయింది. కథతో ప్రేక్షకుడిని కనెక్ట్ చేసే డైరెక్షన్ మిస్ అయింది. అందువల్ల, ఫస్టాప్ అంతా సోల్ లెస్ సినిమా చూసినట్టు ఉంటుంది.

Lakshya telugu review rating
Lakshya telugu review rating

ఇంకా సెకండాఫ్ అంతా కూడా అలానే చాలా సోసో గా ఆకట్టుకోని నరేషన్ తో మారిపోయినట్టు అనిపిస్తుంది. ఈ చిత్రంలో జగపతి బాబు మంచి నటన కలిగిన పాత్ర కూడా సిల్లీ గా డిజైన్ చెయ్యడం జరిగింది. మొత్తానికి లక్ష్య అనే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు , ముఖ్యంగా స్పోర్ట్స్ స్టోరీ సినిమాలు నచ్చే వారికి విపరీతంగా నచ్చే సినిమా అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు.

దర్శకుడు సంతోష్ ప్రయత్నం బాగున్నప్పటికీ అక్కడ అక్కడ జరిగిన స్టోరీ అలాగే స్క్రీన్ ప్లే మిస్టేక్స్ వలన సినిమా కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. మొత్తానికి ఈవారం కుటుంబం అంత ఈ సినిమాని హ్యాపీ గా ఈ సినిమాని ఓసారి చూసేయచ్చు .

 

REVIEW OVERVIEW
CB Desk
Previous articleగమనం మూవీ రివ్యూ మరియు రేటింగ్
Next articleమరో ఘనత అందుకున్న యంగ్‌ రెబల్‌ స్టార్‌..!