Naga Shourya New Movie With Director Annish Krishna

naga shourya New Movie:హ్యాండ్స‌మ్ హీరో నాగ‌శౌర్య‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ కాంబినేష‌న్‌లో ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 4గా ఒక రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌ను నిర్మించేందుకు ఐరా క్రియేష‌న్స్ స‌న్నాహాలు ప్రారంభించింది.

శుక్ర‌వారం సోష‌ల్ మీడియాలో కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయ‌డం ద్వారా అఫిషియ‌ల్‌గా ఆ మూవీని ప్ర‌క‌టించారు. ఉష ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఆహ్లాద‌క‌ర‌మైన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నుంది. డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ‌కు ఇది మూడో సినిమా.

ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఇదివ‌ర‌కు నాగ‌శౌర్య సూప‌ర్ హిట్ ఫిల్మ్ ‘ఛ‌లో’కు ఆయ‌న బ్లాక్‌బ‌స్ట‌ర్ మ్యూజిక్ అందించారు. ఆ సినిమాలోని ‘చూసీ చూడంగానే..’ సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో మ‌న‌కు తెలుసు.

షూటింగ్‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి చేయ‌నున్నారు.

సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: అనీష్ కృష్ణ‌
నిర్మాత‌: ఉష ముల్పూరి
స‌మ‌ర్ప‌ణ‌: శ‌ంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి
బ్యాన‌ర్‌: ఐరా క్రియేష‌న్స్‌
సంగీతం: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
స‌హ నిర్మాత‌: బుజ్జి
డిజిట‌ల్ హెడ్‌: ఎం.ఎస్‌.ఎన్‌. గౌత‌మ్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌