Thaman on Guntur Karam: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) 28వ చిత్రం గుంటూరు కారం మొదలైనప్పటి నుండి హీరో మహేష్ బాబు మరియు సంగీత దర్శకుడు థమన్ మధ్య తీవ్ర విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో తమన్‌ను తీసేస్తున్నారు అంటూ చాలాసార్లు పుకార్లు వెలువడ్డాయి, కానీ వాటి నుండి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు ఈ రూమర్ నిజమై గుంటూరు కారం నుంచి తమన్ తప్పుకుంటాడని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది.
Thaman on Guntur Karam: మహేష్ బాబు (Mahesh Babu) గుంటూరు కారం నుంచి ఎస్ థమన్ తప్పుకున్నట్లు సమాచారం. పాపులర్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ ని తీసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుంటూరు కారం టైటిల్ అనౌన్స్‌మెంట్ టీజర్‌కి థమన్ సంగీతం అందించినందుకు మిశ్రమ స్పందనలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పటిదాకా స్పందించని గుంటూరు కారం ప్రొడ్యూసర్ ఇప్పుడు తమన్ పై వస్తున్న రూమర్స్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించటం జరిగింది.
ఎన్ టీవీ న్యూస్ ఛానల్ కు సంబంధించిన రిపోర్టరు ట్విట్టర్ వేదిక గుంటూరు కారం ప్రొడ్యూసర్ నాగ వంశీని ట్యాగ్ చేసి ప్రశ్నించడం జరిగింది. దీనికి ప్రొడ్యూసర్ స్పందిస్తూ అటువంటిది ఏమీ లేదు.. తమన్ సినిమాకి కావాల్సినంత సపోర్ట్ గా ఉన్నారంటూ బదులు ఇవ్వటం జరిగింది. సోషల్ మీడియాలో వస్తున్న రోమర్స్ ని ఎవరు నమ్మొద్దు అంటూ.. సినిమాకు సంబంధించిన మరొక అప్డేట్ త్వరలోనే మీ ముందుకు రాబోతుందని చెప్పడం కూడా జరిగింది..

12 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ అలాగే మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మొదటి దగ్గర నుంచి రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇక గుంటూరు కారం సినిమా షూటింగ్ విషయానికి వస్తే జులై 12 నుండి కొత్త షూటింగ్ షెడ్యూల్ మొదలు కాబోతున్నట్టు.. ఇది దాదాపు 20 రోజుల పైనే షూటింగ్ జరుపుతారని సమాచారం అందుతుంది. పూజ అలాగే శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు మొదటి లుక్కు తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.