RRR movie – Nagababu – Raghavendra Rao – Tammareddy Bharadwaj: జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ కలిసి నటించిన మొట్టమొదటి సినిమా ఆర్ఆర్ఆర్ (RRR Movie) దర్శకతీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆస్కార్ (Oscar) నామినేషన్ లో ఉండటం మన తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయం. మన తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకువెళ్లిన రాజమౌళిని కొంతమంది పొగడ్తలతో ముంచేస్తుంటే మరికొంతమంది విశ్లేషిస్తున్నారు. వారిలో టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ్.
RRR movie – Nagababu – Raghavendra Rao – Tammareddy Bharadwaj: తమ్మారెడ్డి భరద్వాజ్ రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత రెండు రోజులుగా ఈ వివాదం కొనసాగుతుంది. ఇదంతా ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ (RRR Oscar) నామినేషన్ లో ఉండటం కోసం అని చేసినా ప్రమోషన్స్ కోసం 80 కోట్ల ఖర్చు అయిందంట.
ఈ విషయం గురించి ప్రెస్ మీట్ లో భరద్వాజ్ మాట్లాడుతూ అవే డబ్బులు మాలాంటి దర్శకులకు ఇచ్చినట్లయితే ఎనిమిది నుంచి పది సినిమాలు తీసేవాళ్ళమని కామెంట్ చేయడం జరిగింది. అయితే అందరూ దీన్ని సినిమాకి ఆస్కార్ నామినేషన్ లో ఉండటం గొప్పతనం గాని డబ్బులు ఖర్చు గురించి ఎవరు ఆలోచిస్తారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
అయితే దీనిపై మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇవ్వడం జరిగింది. మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) అయితే డైరెక్ట్ గా ‘నీ** మొగుడు ఖర్చు పెట్టాడారా రూ.80 కోట్లు RRR కి ఆస్కార్ కోసం’ అంటూ ఘాటుగా తన సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు. అయితే దీనికి క్యాప్షన్ గా వై.సీ.పీ. వారి భాషలో సమాధానం అంటూ కూడా పోస్ట్ చేయడం జరిగింది.
అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఏకంగా ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేశారు. దీనిలో దర్శకుడు రెండు ప్రశ్నలను లేవనెత్తారు.. విడుదల చేసిన ప్రెస్ నోట్ లో తెలుగు సినిమాకి, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడు, కి తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి… అంతేకానీ 80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా..? అని ఒక ప్రశ్న వేశారు.
అలాగే రెండో ప్రశ్నగా.. జేమ్స్ కెమెరాన్, స్పిల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని ఉద్దేశమా..? అని అడగటం జరిగింది. మరి దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ఈనెల 12వ తారీఖున ఆస్కార్ అవార్డులు ప్రకటించబోతున్నారు. దీనిని అందరు చూసే విధంగా డిస్నీ హాట్ స్టార్ వారు లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు.