వద్దని ఎంత చెప్పినా వినలేదు.. లెటర్ రాసి ఒప్పించింది : నాగబాబు

0
250
Nagababu Says About His Daughter Niharika Communication Skills

మెగా బ్రదర్ నాగబాబు తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు అంశాలపై స్పందిస్తూ ఎంతో విలువైన సమాచారాలు ఇస్తున్నారు. కొన్ని సార్లు ఎంటర్ టైన్ చేస్తున్నారు.. కొన్ని సార్లు తెలియని విషయాలను తెలియజేస్తున్నారు. మొత్తంగా నాగబాబు ప్రతి వీడియో కూడా అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ‘మన ఛానల్ మన ఇష్టం’ అంటూ నిత్యం ఏదో ఒక టాపిక్‌పై మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పిల్లలతో తల్లిదండ్రులకు ఎలాంటి రిలేషన్, కమ్యూనికేషన్ ఉండాలో పేర్కొంటూ తన కూతురు నిహారిక విషయాన్ని ప్రస్తావించారు నాగబాబు.

సరిగ్గా కమ్యూనికేట్ చేస్తే ఖచ్చితంగా అవతలి వారు కన్విన్స్ అవుతారు. ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదు అంటూ నాగబాబు ఒక ఉదాహరణతో తెలియజేశాడు. తన కూతురు నిహారిక పదో తరగతిలో ఓ టూర్‌కి వెళ్తానని పట్టుబట్టిన సందర్భాన్ని వివరిస్తూ పిల్లలకు తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేసే ఫ్రీడమ్ ఇవ్వాలని అన్నారు. నిహారిక 10వ తరగతిలో ఉత్తరాంచల్ ట్రిప్ కు వెళ్తాను అంది. స్కూల్ వాళ్లు అందరితో కలిసి వెళ్తున్నందున పంపించాలని కోరింది. కాని నేను పది రోజులు అవ్వడం వల్ల పంపించేందుకు ఒప్పుకోలేదు.

నాలుగు అయిదు రోజులు రిక్వెస్ట్ చేయడంతో ఇద్దరు బాడీగార్డ్స్ ను పంపిస్తా వారు నీకు దూరంగా ఉంటారు. అందుకు ఓకే అయితే వెళ్లు అన్నాను. కానీ నిహారిక మాత్రం ఎంత చెప్పినా వినలేదని నాగబాబు చెప్పారు. ఆ మరుసటి రోజు ఉదయాన లేచేసరికి తన ముందు ఆమె ఓ లెటర్ పెట్టిందని, అందులో ముద్దు ముద్దుగా ఆమె వ్యక్తపరిచిన విషయాలు తనతో ఓకే చెప్పించాయని నాగబాబు అన్నారు.

”నా స్నేహితుల ఫోన్ నెంబర్లు, టీచర్ల నెంబర్లు ఇస్తా. అలాగే రోజూ మూడు నాలుగు సార్లు ఫోన్ చేసి మాట్లాడుతుంటా. ఎక్కడికి వెళ్లినా లొకేషన్ చెబుతా. సిగ్నల్ లేకపోయినా ఎలాగైనా సరే ఫోన్ చేస్తాను.. ప్లీజ్ వెళ్లనివ్వు నాన్నా..” అంటూ ఆ లెటర్‌పై నాగబాబుకు ఇష్టమైన తన ఫోటోలను పెట్టి ఐస్ చేసిందట నిహారిక. తను నన్ను కమ్యూనికేట్ చేసిన విధానం నాకు నచ్చిందని నాగబాబు పేర్కొన్నాడు. ఆ రోజు తను అలా కమ్యూనికేట్ చేయకుంటే నేను ఒప్పుకునే వాడిని కాదు. ఆ రకంగా తల్లిదండ్రులు తమ తమ పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను కొట్టకూడదని నాగబాబు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here