ఆ టైమ్‌లో నాకు మెచ్యూరిటీ లేదు.. తప్పు చేశాను : నాగబాబు

0
477
Nagababu Says About His Relation With Niharika And Varun Tej

Niharika Konidela: Naga Babu: ఏదైనా ఓపెన్‌గా మాట్లాడటం మెగా బ్రదర్ నాగబాబుకి అలవాటు. మెగా బ్రదర్ నాగబాబు కొణిదెల సొంత యూట్యూబ్ ఛానల్ ‘మన ఛానల్ మన ఇష్టం’ ద్వారా అన్ని విషయాలపై స్పందిస్తూ ఉన్నారు. కుటుంబ విషయాలు సినిమా సంగతులతో పాటు పలు సామాజిక అంశాలపై మాట్లాడుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా తల్లిదండ్రులతో పిల్లల అనుబంధం గురించి మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా తన పిల్లలు నిహారిక – వరుణ్ తేజ్ లతో తన ప్రవర్తన ఎలా ఉంటుందనే విషయం వెల్లడించాడు.

ఈ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ.. ”నేను గొప్ప కమ్యూనికేటర్‌ని కాకపోవచ్చు గానీ ఎంతోకొంత బెటర్ అని నా ఫీలింగ్. నా పిల్లలు నిహారిక, వరుణ్‌లకు చాలా విషయాలు కూలంకషంగా చెప్పేవాడిని. ఒక్కోసారి పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తిట్టడం, కొట్టడం లాంటివి కూడా చేసేవాడిని. నిహారిక, వరుణ్‌లను ఒకటి రెండు సార్లు కొట్టాను కూడా. కానీ పిల్లలను కొట్టకూడదు. అది నేను చేసిన తప్పు. ఆ టైమ్‌లో నాకు మెచ్యూరిటీ లేక అలా చేశాను.

పిల్లలకు నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే.. మీరు మొదట తల్లిదండ్రులతో ఫ్రీ గా మాట్లాడండి. అన్నీ షేర్ చేసుకోండి. పిల్లలిద్దరినీ పిలిచి వాళ్లకు ఓ గ్యారెంటీ ఇచ్చాను. ఈ భూమి మీద మీ జీవితంలో ఏ చిన్న సమస్య అయినా లేదా పెద్ద సమస్య అయినా వస్తే నేనొక్కడిని మాత్రమే మీ సమస్యను సరిగ్గా అర్థం చేసుకొని పరిష్కారం చేయగలను. చెప్పుకోలేని సమస్య వచ్చినా చెప్పండి.. ఎందుకంటే ఈ భూమిపై మీ కంటే నాకు విలువైన వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పాను. నా పిల్లలతో కమ్యూనికేట్ కావడంలో ఎలాంటి దాపరికాలు పెట్టుకోలేదు.

డిగ్రీ చదువుతున్న రోజుల్లో వరుణ్ సినిమాల్లోకి వస్తా అంటే వెంటనే సరే అనేశాను. కానీ ఒక్కటే చెప్పా.. ఒకవేళ నటుడిగా సక్సెస్ కాకపోతే డిజప్పాయింట్ కావొద్దని అన్నా. వరుణ్.. నీ కష్టంలో గానీ, హార్డ్ వర్క్‌లో గానీ తేడా రానీయకు. అంతేగానీ నేను పెద్ద హీరో కాకపోతే నాన్నకు మాటిచ్చాను.. ఇప్పుడెలా అనుకోవద్దు. నువ్ ఎలా ఉన్నా సరే యూ ఆర్ మై సన్. అదేవిధంగా నిహారికకు కూడా అదే చెప్పా. మీరు సాధించినా, సాధించకపోయినా అది మీ వ్యక్తిగతం. అంతేగానీ నా కొడుకు, కూతురు సక్సెస్ కాలేదని నేను బాధపడను. నాకు పిల్లలు సంతోషంగా ఉండాలి. అంతే.. అలానే వాళ్ళను కమ్యూనికేట్ చేశాను” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here