Nagababu shocking comments on Jabardasth show
Nagababu shocking comments on Jabardasth show

‘జబర్దస్త్’ కామెడీ షో షోకి కొన్ని సంవత్సరాలుగా(షో మొదలైన సమయం నుండి) న్యాయనిర్ణేతగా ఉన్న నాగబాబు ఇటీవలే ఆ షో నుండి తప్పుకున్నారు. కొంతమంది టీమ్ లీడర్లతో కలిసి నాగబాబు వేరే టీవీ ఛానల్లో సందడి చేయనున్నారు. జబర్దస్త్ ను వీడిపోడానికి కొన్ని కారణాలను.. ఆ షోతో ఆయనకు ఉన్న అనుబంధాలను చెప్పుకుంటూ వచ్చారు.

ముఖ్యంగా రెమ్యునరేషన్ కారణంగానే ఆ షోను వదిలిపెట్టానని వచ్చిన రూమర్స్ కు ఆయన చెక్ పెట్టారు. ‘జబర్దస్త్’ షోకి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అయినప్పటికీ .. ఇది మల్లెమాల షో అని కొందరు .. ఈటీవీ షో అని మరికొందరు అన్నప్పటికీ నేను ఆ విషయాలను గురించి పెద్దగా ఆలోచించలేదన్నారు.. ఇది నా షో అనుకుని చేసేవాడినన్నారు. ‘జబర్దస్త్’కి సంబంధించిన వాళ్లమంతా ఒక కుటుంబంలా కలిసి ఉండేవాళ్లమనీ .. ఏ ఒక్కరికి కష్టం వచ్చినా మిగతా వాళ్లమంతా కలిసి ఆదుకునేవాళ్లమంటూ తమ అనుబంధాల గురించి చెప్పుకొచ్చారు. ఓడిపోయిన టీమ్ లీడర్స్ ఒక్కోసారి డిప్రెషన్‌ లోకి వెళ్లిపోయే వారని కూడా నాగబాబు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మానసికంగా ధైర్యం చెప్పి ముందుకు వెళ్లేలా కృషి చేశామని చెప్పారు.

జబర్దస్త్ షోకి ప్రాణం పెట్టి పనిచేసేది ఆర్ట్ డైరెక్టర్ రమేశ్ అని.. అప్పటికప్పుడు తమకు పలానా సెట్ కావాలని అడిగితే.. తక్కువ సమయంలోనే అలాంటి సెట్‌ను డిజైన్ చేసేవాడని చెప్పారు. జబర్దస్త్ షోకి దర్శకుడిగా వ్యవహరించిన సంజీవ్, ఆ తర్వాత వచ్చిన నితిన్,భరత్ షో సక్సెస్‌కి ప్రధాన కారకులని చెప్పారు. వీరందరి కృషి వల్లే 25 ఎపిసోడ్స్ దగ్గరే ఆగిపోవాల్సిన జబర్దస్త్..ఏడేళ్లు విజయవంతంగా కొనసాగిందన్నారు. రచ్చ రవి యాక్సిడెంట్ గురించి కూడా నాగబాబు ప్రస్తావించారు. రచ్చ రవికి యాక్సిడెంట్ అయిన సమయంలో జబర్దస్త్ టీమ్ అంతా అతనికి ఆర్థిక సహాయం అందించిందని అన్నారు. రచ్చ రవికి యాక్సిడెంట్ అయితే అపోలోలో చికిత్స చేయించారు. తాను చెబితే మంచి ట్రీట్‌మెంట్ ఇస్తారని కోరడంతో నేను ఆస్పత్రికి వెళ్లి డాక్టర్లతో మాట్లాడానని అన్నారు. ఆ సమయంలో రచ్చ రవి తల్లిదండ్రులకు కొంత ఆర్థిక సాయం చేశానన్నారు నాగబాబు. జబర్దస్త్‌లో అందరం ఐక్యమత్యంగా కుటుంబంగా ఉన్నామని.. కష్టసుఖాలను పంచుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న లోకల్ గ్యాంగ్స్‌లో ప్రస్తుతం నాగబాబు కనిపిస్తున్నారు.