Nagababu shocking comments on Jabardasth Team
Nagababu shocking comments on Jabardasth Team

‘జబర్దస్త్’ కామెడీ షోకి కొన్ని సంవత్సరాలుగా న్యాయనిర్ణేతగా ఉన్న నాగబాబు ఇటీవలే ఆ షో నుండి తప్పుకున్నారు. కొంతమంది టీమ్ లీడర్లతో కలిసి నాగబాబు వేరే టీవీ ఛానల్లో సందడి చేయనున్నారు. జబర్దస్త్ ను వీడిపోడానికి కొన్ని కారణాలను.. ఆ షోతో ఆయనకు ఉన్న అనుబంధాలను.. అక్కడ జరిగిన అవమానాలను బయట పెట్టారు నాగబాబు. ముఖ్యంగా వేణు, ధనరాజ్ లాంటి వాళ్ళు షో వదిలిపెట్టి వెళ్ళిపోడానికి ఎదురైన అవమానాలే కారణమని ఆయన అన్నారు.

జబర్దస్త్ మేనేజ్మెంట్ కార్పోరేట్ కంపెనీలాగే ఆలోచించి.. తమ షో ఒక్కటి బాగా వస్తే చాలు ఎవరు ఎటుపోతే తమకెందుకు అన్నట్లే ఆలోచించారని సంచలన వ్యాఖ్యలు చేశారు నాగబాబు. వేణువండర్స్‌పై దాడి జరిగితే కనీసం మల్లెమాల కానీ.. ఛానెల్ వాళ్లు కానీ ఒక్కముక్క కూడా మాట్లాడలేదని అన్నారు నాగబాబు. వేణు, ధనరాజ్ లాంటి వాళ్లు అందుకే బయటికి వెళ్లిపోయరేమో అని తెలిపారు నాగబాబు. ఇక ఆ తర్వాత సుడిగాలి సుధీర్, ఆర్పీ, భాస్కర్ లాంటి వాళ్లు టీం లీడర్స్ కావడంలో తాను కూడా కీలక పాత్ర పోషించానని చెప్పారు నాగబాబు. ఆ షో నిర్వాహకులైన మల్లెమాల సంస్థ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మంచి వ్యక్తి అని, అయితే ఆ సంస్థలో కొందరి వల్లనే మొత్తం జబర్దస్త్ షో కు ప్రస్తుతం నష్టం చేకూరే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. మల్లెమాలలో కొందరు మంచివారు ఉన్నప్పటికీ, మరి కొందరు సంస్థలో చేరి నష్టం చేకూరుస్తున్నారని అన్నారు.

ఈ షో సమయంలో ప్రొడక్షన్స్ వాల్యూస్ దారుణంగా ఉండేవన్నారు నాగబాబు. జబర్దస్త్‌లో పనిచేసేవాళ్లు మల్లెమాల బాగుకోసమే కష్టపడేవాళ్లునీ.. కాని టీం లీడర్స్ గురించి పట్టించుకునేవాళ్లు కాదన్నారు. నన్ను బాగానే చూసుకున్నారు కాని మిగతా టీం వాళ్లకు ఫుడ్‌ కూడా సరిగా పెట్టేవారు కాదన్నారు. మినిమమ్ ప్రొడక్షన్ వాల్యూస్ లేకుండా రాను రాను మరీ తగ్గించేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు నాగబాబు.