Nagarjuna, Naga Chataya, Akhil Movies: అక్కినేని నాగార్జున నట వారసుడిగా ఎంటర్ అయిన అఖిల్ మొదటి సినిమా అఖిల్ నుంచి నిన్న మొన్న రిలీజ్ అయిన ఏజెంట్ వరకు ఎంత కష్టపడినప్పటికీ పాపం లక్ మాత్రం కలిసి రావడం లేదు. ఏజెంట్ మూవీ కంటే ముందు వచ్చిన బ్యాచిలర్స్ సినిమా కాస్త కమర్షియల్ గా వర్క్ అవుట్ అయింది అంటే అందులో హీరోయిన్ పూజా హెగ్డే గ్లామర్ పాత్ర ఎక్కువ అని చెప్పవచ్చు. దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన అఖిల్ చిత్రం ఊహించని విధంగా అక్కినేని కుటుంబానికి నిరాశ మిగిల్చింది.
Nagarjuna, Naga Chataya, Akhil Movies: మూవీ చూసిన ఎవరికైనా ఈ చిత్రం కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడు అని అర్థమవుతుంది కానీ ఆ కాన్సెప్ట్ అతనికి నప్పుతుందా లేదా అని డిసైడ్ చేసుకునే విషయంలో అఖిల్ తడబడ్డాడు అని చెప్పవచ్చు. అక్కినేని కుటుంబం నుంచి ప్రస్తుతం వచ్చిన యువ హీరోల్లో ఒక్క నాగచైతన్య మాత్రం పరవాలేదు అనిపించుకుంటున్నారు. సుమంత్ సుశాంత్ వారి తర్వాత అఖిల్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు.
ప్రేమ కథ మూవీ తో హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య హీరోగా పరిచయమయ్యాడు సుమంత్. ఆ తరువాత యువకుడు, పెళ్లి సంబంధం ,రామ్మా చిలకమ్మా లాంటి చిత్రాలు చేసిన వరుస ప్లాపులు ఎదురయ్యాయి. సత్యం మూవీతో సుమంత్ ఖాతాలో ఓ మంచి కమర్షియల్ హిట్ వచ్చింది. కానీ ఆ తర్వాత గోదావరి తప్ప ఇంకా మరో హిట్ చిత్రం అతని కెరియర్లో లేదు.
కాళిదాసు మూవీతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మరో అక్కినేని హీరో సుశాంత్. ఐదు సినిమాల తరువాత చిలసౌతో అతని ఖాతాలో ఒక్క హిట్టు పడింది. హీరో కంటే కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్ బెటర్ అనుకున్నాడో ఏమో గత కొద్ది కాలంగా మంచి సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సెటిల్ అయిపోయాడు.
మరి తాజాగా ఈ ఇద్దరి పక్కన అఖిల్ చేరుతాడా అన్న ప్రశ్న అక్కినేని అభిమానుల్లో రేకెత్తుతోంది. నాగచైతన్య ఆడియన్స్ తనను ఎలాంటి సినిమాల్లో ఇష్టపడతారు అలాంటి కథలను ఎంచుకొని ఎంతో కొంత తనకంటూ హిట్లు సంపాదించుకుంటున్నాడు. మరోపక్క అఖిల్ కథల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు..