‘వైల్డ్ డాగ్’ లుక్‌తో సర్ ప్రైజ్ చేసిన నాగార్జున.. !

Nagarjuna Akkineni's Second Look From Wild Dog On His Birthday

నేడు టాలీవుడ్ మన్మథుడు బర్త్ డే సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ ఆయన నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘వైల్డ్ డాగ్’ సెకండ్‌ లుక్‌ని విడుదల చేశారు. నాగార్జున టైటిల్ రోల్‌లో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’

చిత్రంలో నాగార్జున.. డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో కనిపించబోతున్నారు. అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విజ‌య్ వ‌ర్మను పోలీస్ శాఖ‌లో అంద‌రూ వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఇందులో నాగ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. తాజా పోస్టర్‌లో నాగార్జున గన్ గురిపెట్టి సీరియల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇందులో ఎన్‌ఐఏ పోలీస్‌ ఆఫీసర్‌ విజయ్‌ వర్మగా నాగ్‌ కనిపించనున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో ఆకట్టుకున్న అలీ రెజా కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. త్వరలో ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నారు.

ఇందులో నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ దియా మీర్జా హీరోయిన్ గా నటిస్తోంది. ఉపిరి, మహర్షి చిత్రాలకి కథ అందించిన అహిషోర్‌ సోలోమన్‌ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు నాగ్.. దాదాపుగా 70 శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ధియేటర్ లోనే రిలీజ్ చేయనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *