బంగార్రాజు మొదలుపెట్టేశాడు..!

0
666
Nagarjuna and Naga Chaitanya begin Bangarraju shoot

Nagarjuna: Naga Chaitanya: Bangarraju: అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున తన తదుపరి ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేశారు. నాగార్జున ఆయన తనయుడు నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించనున్న ‘బంగార్రాజు’ శుక్రవారం వేడుకగా ప్రారంభమైంది. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ‘బంగార్రాజు’ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది.

ఈ పూజా కార్యక్రమానికి నాగార్జున, నాగచైతన్య, కృతిశెట్టి, దర్శకుడితోపాటు ఇతర చిత్రబృందం హాజరయ్యారు. 2016లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సిద్ధం కానుంది. అన్నపూర్ణ స్టూడియోలో వేస్తున్న ఆ సెట్టింగ్స్ తుది దశకు చేరుకున్నాయని.. వచ్చే వారం నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.

Nagarjuna and Krithi shetty begin Bangarraju shoot photos

మొత్తానికి బంగార్రాజు కోసం అయిదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఖచ్చితంగా ఒక మంచి సినిమాను యూనిట్ సభ్యులు అందించబోతున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నే కంటిన్యూ అవుతుందా అనే విషయంలో మాత్రం కాస్త సస్పెన్స్ కొనసాగుతోంది. అనూప్ రూబెన్స్ బంగార్రాజు సంగీతం సమకూర్చనున్నారు. ఈ చిత్రాన్ని నాగార్జున హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించనున్నారు.

Nagarjuna and Krithi shetty begin Bangarraju shoot photos

Nagarjuna and Krithi shetty begin Bangarraju shoot photos

 

Previous articleNagarjuna and Naga Chaitanya begin Bangarraju shoot.
Next articleChiranjeevi with Director Bobby next #Chiru154 date locked