‘బంగార్రాజు’కి ఇక వేస‌వే దిక్కు !

102
Nagarjuna, Naga Chaitanya, Bangarraju Film News
Nagarjuna, Naga Chaitanya, Bangarraju Film News

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ కూడ ఒకటి. 2015 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున ఇద్దరూ ఆ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే. అయితే బంగార్రాజు సినిమాను సంక్రాంతికి విడుద‌ల అనుకున్నారు. కానీ బంగార్రాజు సంక్రాంతికి వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. అయితే బంగార్రాజు సినిమా స్క్రిప్ట్ పనులు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయట. అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోదరుడు మరణం కారణంగా సినిమా పనులు కొన్నాళ్ళు వాయిదా పడ్డాయి. పైగా ప్రస్తుతం నాగ్, ‘బిగ్‌ బాస్‌-3’తో బిజీగా ఉన్నాడు. దాంతో అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇక అక్టోబర్ లో సినిమాను మొదలుపెట్టి, వ‌చ్చే ఏడాదే వేస‌విలో బంగార్రాజుని విడుద‌ల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.