Nagarjuna Bigg Boss 7 Remuneration: బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 3 ఆదివారం సాయంత్రం ప్రారంభమవుతుంది. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, అదే తేదీని స్టార్ట్ ఐయే అవకాశం ఉంది. ఈ కొత్త సీజన్ 106 రోజుల పాటు కొనసాగుతుంది అలాగే 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో కి వెళ్లారు. అయితే మళ్లీ నాగార్జునే బిగ్ బాస్ 7 కి కూడా హోస్టుగా చేస్తున్నారు. మూడవ సీజన్ నుండి వరుసగా ఏడవ సీజన్ వరకు, నాగార్జున మొత్తం ఐదు సీజన్ల కి హోస్ట్ చేస్తున్నాడు. సీజన్ 1కి ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, సీజన్ 2కి నాని హోస్ట్ గా వ్యవహరించగా, సీజన్ 3, 4, 5, 6, OTTకి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.
Nagarjuna Bigg Boss 7 Remunerationఅయితే బిగ్ బాస్ ఏడవ సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇపుడు నాగార్జున రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గ మారింది సోషల్ మీడియాలో. ఏడో సీజన్ కోసం నాగార్జున రూ.200 కోట్లు పారితోషికం తీసుకుంటారని సోషల్ మీడియాలో కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. ఇది నిజంగా 200 కోట్ల రూపాయలా? లేకపోతే, సున్నా జోడించబడిందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హోస్టుగా నాగార్జున వున్నారు. మూడో సీజన్‌లో అత్యధికంగా రూ.5 కోట్ల పరిహారం అందినట్లు సమాచారం. కేవలం 15 వారాలు జరిగే బిగ్ బాస్ షో కి.. నాగార్జున వారానికి రెండు రోజులు కనిపిస్తాడు. శని, ఆదివారాల్లో వస్తారు. గతంలో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్‌కి అతని పరిహారం రెండున్నర కోట్లు. అయితే ఆ సీజన్ కేవలం 70 రోజులు మాత్రమే వుంది. ఆ తర్వాత సెకండ్ సీజన్ మొత్తం 106 రోజులు గాను నాని కి మూడు కోట్లు తీసుకున్నారు.

ఇక నాల్గవ సీజన్‌కి వచ్చేసరికి శాలరీ మారిపోయింది. ఈ సీజన్‌కు గాను నాగార్జున 8 నుంచి 10 కోట్ల వరకు అందుకున్న సంగతి తెలిసిందే. ఐదో సీజన్‌కు 12–15 కోట్లు, ఆరో సీజన్‌కు 15 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతం నాగార్జున 200 కోట్ల రెమ్యూనరేషన్ వైరల్ గ మారింది. కానీ అది కేవలం ప్రకటన మాత్రమే. నాగార్జున సీజన్ 7కి పారితోషికం 20 కోట్ల రూపాయలకు మించి ఉండకపోవచ్చు. అయితే, ఈ ఊహాగానాలపై అధికారిక ధృవీకరణ లేదు.