Homeసినిమా వార్తలుధనుష్, శేఖర్ కమ్ముల కొత్త మూవీలో నాగార్జున..!!

ధనుష్, శేఖర్ కమ్ముల కొత్త మూవీలో నాగార్జున..!!

Nagarjuna key role in Dhanush and Shekar movie, Nagarjuna and dhanush multi starrer movie confirmed officially. Nagarjuna new movie details

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ & నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో పవర్ ప్యాక్డ్ రోల్ లో కింగ్ నాగార్జున అక్కినేని జాయిన్ అయ్యారు. మేకర్స్ ఈ రోజు ఆఫిసిఅల్ గా నోట్ విడుదల చేయడం జరిగింది.

ఈ మల్టీస్టారర్ చిత్రానికి స్టార్ పెర్ఫార్మర్ కోసం వెతుకుతున్న మేకర్స్ “తన చరిష్మాతో తెరపై వెలుగులు నింపడానికి మన ‘కింగ్ ‘ కంటే ఎవరు బెటర్ ” అని భావించారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ రోజు అనౌన్స్ మెంట్ చేశారు . ఇద్దరి స్టార్స్ అభిమానులు వారి స్క్రీన్ పై చూడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ )లో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కలసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్‌ను సృష్టిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY