మెగా సంక్రాంతి సంబరాలు.. నాగార్జున.. ఫొటో వైరల్..!

264
Nagarjuna Participated In Sankranthi Celebrations At Chiranjeevi House

తెలుగువారింట సంక్రాంతి పండుగ అంటే కుటుంబాన్ని అంతటినీ ఒక్కచోటకు చేర్చే పండగ. పేద, ధనిక అనే తేడాలేకుండా అన్నివర్గాల ప్రజలు సంక్రాంతి పండగను ఘనంగా నిర్వహించుకుంటారు. ఇక సెలబ్రెటీలు కూడా ఎంత బిజీగా ఉన్నా పనులన్నీ పక్కకు పెట్టి.. ఈ మూడురోజులు కుటుంబానికే కేటాయిస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి ఇంట సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సంబరాల్లో అక్కినేని హీరో నాగార్జున కూడా భాగం కావడం విశేషం.

కొడుకులు, అల్లుళ్లు, కూతుళ్లతో కలిసి ఎంతో ఆనందంగా సంక్రాంతిని జరుపుకుంటున్నారు చిరంజీవి. మెగాస్టార్ ఇంట జ‌రిగిన సంక్రాంతి వేడుక‌ల‌కు నాగార్జున ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. చిరు నాగ్ ల మధ్యనే కాదు. వారి కుటుంబాల మధ్య కూడా మంచి స్నేహసంబంధాలున్న సంగతి తెలిసిందే. కొణిదెల వారింట ఈసారి జరుగుతున్న సంబరాలు వెరీవెరీ స్పెషల్ గా మారాయి. ‌ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున స‌హా మెగా ఫ్యామ‌లీ హీరోలు రామ్‌ చ‌ర‌ణ్‌, వ‌రుణ్‌ తేజ్‌, సాయి ధరమ్ తేజ్‌, అల్లు శిరీశ్, వైష్ణవ్ తేజ్, ఇత‌ర కుటుంబ స‌భ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. తన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నక్సలైట్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్.. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించనున్నాడు.