Nagarjuna, Rakul Preet Manmadhudu 2
Nagarjuna, Rakul Preet Manmadhudu 2

నాగార్జున కథపై నమ్మకం పెట్టుకుని,భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా మన్మథుడు-2.ఆ సినిమా టీజర్ రాగానే సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉంది అనేది అర్థమైపోయింది.నాగార్జున లెట్ ఏజ్ లో చేసిన సెటైరికల్ కామెడి బాగానే పేలింది.దాంతో నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఈ సినిమా పెట్టిన బడ్జెట్ లో చాలా వరకు రాబట్టింది.ఈ బజ్ తో మన్మథుడు-2 కి సోలో రిలీజ్ ఖాయం అనుకున్నారు అంతా.కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారింది.మన్మథుడు తో పోటీ కి రెడీ అంటున్నారు మరో ఇద్దరు.

క్షణం లాంటి సినిమాతో హిట్ అందుకున్న అనసూయ కి సినిమాలపరంగా కూడా క్రేజ్ ఉంది.రంగస్థలం,F2 లాంటి సినిమాల్లో కూడా ఆమె నటించడంతో ఆమె క్రేజ్ కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాదు అని ప్రూవ్ అయ్యింది.అయితే ఆమె ఇప్పుడు కథనం అనే సినిమాతో ప్రేక్షకులముందుకు రాబోతుంది.ఆ సినిమా అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కుతుంది.ఆ సినిమా కూడా మన్మథుడు-2 కి పోటీగా ఆగస్టు 9 నే రిలీజ్ అవుతుంది.హృదయ కాలేయం సినిమాతో మంచి అందుకున్న సంపూర్ణేష్ బాబు మళ్ళీ ఆ రేంజ్ ని నిలబెట్టుకోలేకపోయాడు.కానీ మళ్ళీ చాలా గ్యాప్ తరువాత కొబ్బరిమట్ట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.పైగా ఇది హృదయ కాలేయం సినిమా టీమ్ నుండి వస్తున్న సినిమా.ఇప్పటికే వరల్డ్ రికార్డ్ డైలాగ్ అంటూ హడావిడి చేస్తున్నారు.పైగా ట్రైలర్ చూస్తే కాస్తో,కూస్తో కామెడీ పండినట్టు కనిపిస్తుంది.అందుకే ఈ సినిమాని కూడా మన్మథుడు-2 కి ఒక్క రోజు లేట్ గా ఆగష్టు 10 న రిలీజ్ అవుతుంది.

నిజానికి మన్మథుడు-2 బడ్జెట్ పరంగా చూసుకున్నా,క్రేజ్ పరంగా చూసుకున్నా కూడా కథనం,కొబ్బరిమట్ట కి అందని రేంజ్ లో ఉన్న సినిమా.కానీ సినిమా ఫలితం అనేది ఎలా ఉంటుంది అనేది అది చూసాకమాత్రమే చెప్పగలం.ఒక వేళ మన్మథుడు-2 అనుకున్న దానికి కాస్త తగ్గినా కూడా కథనం,కొబ్బరిమట్ట సినిమాల్లో ఏది కాస్త బెటర్ టాక్ తెచ్చుకున్నా ఆ టాక్ ఖచ్చితంగా మన్మథుడు-2 కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.మరి చిన్న సినిమాలు మన్మథుడికి షాక్ ఇస్తాయా? లేక ఇలా వచ్చి అలా వెళతాయా అనేది ఆగష్టు 9 న తేలుతుంది.