మన్మథుడు-2 ట్రైలర్: ఫన్ అండ్ కూల్

Nagarjuna, Rakul Preet Manmadhudu 2 Trailer Talk Review, Cast
Nagarjuna, Rakul Preet Manmadhudu 2 Trailer Talk Review, Cast

నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా మన్మథుడు-2.సూపర్ హిట్ సినిమా కి సీక్వెల్ అన్న కలరింగ్ లో ఈ సినిమా తెరకెక్కడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక టీజర్ కూడా చాలా కూల్ గా,బ్రీజీగా,లైటర్ ఫన్ తో తెరకెక్కడంతో ఈ సినిమా పై అందరిలో క్యూరియాసిటీ ఏర్పడింది.ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే పబ్లిక్ లో ఈ సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ తో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటుంది.కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే 21 కోట్ల రిటర్న్స్ వచ్చాయి.అంటే ఆల్మోస్ట్ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం తిరిగొచ్చేసింది.

దీంతో సినిమాపై ఏర్పడిన భారీ బజ్ ని సస్టైన్ చేసేలా ఉంది ట్రైలర్.టీజర్ లో చూపించిన హీరో లేట్ ఏజ్ మ్యారేజ్ నే ఇందులో కూడా ఫోకస్ చేశారు.కాకపోతే హీరో,హీరోయిన్ ల మధ్య నడిచే ట్రాక్ ని కాస్త ఎక్కువగా రివీల్ చేసారు.సినిమాలో ఆ పాయింట్ ఉండడం బావుంది.కానీ అదొక్కటే పాయింట్ మీద సినిమా అంటే మాత్రం ఇబ్బందిగా మారొచ్చు.అయితే ట్రైలర్ లో ఎమోషన్స్ కి కూడా స్కోప్ ఉంది అని అర్ధమయ్యేలా కొన్ని షాట్స్ ఉన్నాయి.మరి అవి అసలు కథకు ఏమైనా లీడ్ అవుతాయా అనేది సినిమాలో కన్వే అవుతుంది.డైలాగ్స్ కూడా కాస్త ట్రెండీ గా,యూత్ టచ్ తో ఉన్నాయి.సినిమా ఎక్కువ భాగం పోర్చుగల్ లో తియ్యడంతో అంతటా రిచ్ లుక్ ఉంది.ఈ సినిమాలో నాగార్జున లుక్ మొదటి నుండి ఇంప్రెసివ్ గానే అనిపించింది.మరీ మన్మథుడు టైం లో ఉన్నట్లు లేకపోయినా ఏజ్ తగ్గిన ఫీలింగ్ అయితే వస్తుంది.రకుల్ తో జోడి ఆడ్ గా అనిపించట్లేదు.రకుల్ ప్రీత్ మాత్రం అన్తరా స్టైలిష్ గా ఉంది.ఆమె డ్రెస్సింగ్ కూడా చాలా మోడరన్ గా ఉంది.

ఈ సినిమాలో వెన్నెల కిషోర్ షేర్ ఎంత అనేది అర్ధమవుతుంది.సినిమా అంతటా హీరో పక్కనే ఉంటూ కామెడీ పంచే బాధ్యత తీసుకున్నాడు.అతని కామెడీ మన్మథుడు-2 కి బిగ్గెస్ట్ ఎస్సెట్.ఇక టీజర్ వరకు జస్ట్ అలా కనిపించిన రావు రమేష్ కి కూడా సినిమాలో మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది.అయితే ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ చేసిన సమంత,కీర్తి సురేష్ లను మాత్రం ట్రైలర్ లో చూపించలేదు.రాహుల్ రవీంద్రన్ టేకింగ్ బావుంది.టెక్నికల్ గా మంచి స్టాండర్స్డ్ ల్లో ఉంది మన్మధుడు-2.అయితే ఈ సినిమా ఏ రేంజ్ విజయం సాధిస్తుంది అనేది మాత్రం ఆగస్టు 9 న తెలుస్తుంది.