ఏప్రిల్ 2న థియేటర్లో నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా

350
nagarjuna-wild-dog-movie releasing on April 2nd
nagarjuna-wild-dog-movie releasing on April 2nd

టాలీవుడ్‌లో ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోల్లో నాగార్జున ముందు వరుసలో ఉంటారు. తాజాగా నాగార్జున ‘వైల్డ్ డాగ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వం వహిస్తున్నాడు.

 

ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. చాలా వరకు కొత్తవాళ్లతోనే ఈ సినిమా చేశారు నాగార్జున. ఈ సినిమాలో నాగార్జున ఎన్‌.ఐ.ఎ ఆఫీస‌ర్‌గా కనిపించనున్నారని రీసెంట్ గా విడుదలైన ఫ‌స్ట్ లుక్‌లోని న్యూస్ పేప‌ర్ రిపోర్ట్ ఆధారంగా తెలుస్తుంది.

 

అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విజ‌య్ వ‌ర్మను పోలీస్ శాఖ‌లో అంద‌రూ వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

 

ఈ చిత్రం మొదట netflix లో రిలీజ్ అవుతుంది అనుకోనున్నారు కానీ తాజాగా వైల్డ్ డాగ్‌ చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. నాగార్జున మాట్లాడుతూ.. ఇప్పటివరకు ‘వైల్డ్ డాగ్’ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఉన్నది.. ఇక మీదట దయచేసి దాన్ని మర్చిపోండి, వైల్డ్ డాగ్ ఓటీటీ సినిమా కాదు, థియేటర్ లోనే లైవ్ కాబోతుందని నాగార్జున తెలిపారు. ఏప్రిల్ 2న విడుదల చేయబోతున్నట్లు నాగార్జున తెలిపారు. కాగా బంగార్రాజు సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జూన్-జులై నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని నాగార్జున తెలిపారు.