వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ

Nagarjuna Wild Dog Movie Review & Rating
విడుదల తేదీ : ఏప్రిల్ 02, 2021
రేటింగ్ : 3/5
నటీనటులు : నాగార్జున‌, స‌యామీ ఖేర్‌, దియామీర్జా, త‌దిత‌రులు
దర్శకత్వం : అషితోష్‌ సాలోమ‌న్‌
నిర్మాత‌లు : మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్‌
సంగీతం : థ‌మ‌న్‌
రచన : అషితోష్‌ సాలోమ‌న్‌.

కింగ్ నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వైల్డ్ డాగ్”. అహిషోర్ సాలొమోన్ దర్శకత్వంలో ఇండియాలోనే బిగ్గెస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం సాలిడ్ ప్రమోషన్స్ నడుమ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైద్రాబాద్ లో వరుస బాంబ్ పేలుళ్ళ నేపథ్యంలో వాస్తవ సంఘటనలతో సాగే ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు థ్రిల్ చేస్తుంది? కొత్త దర్శకుడు అహిషోర్ సోల్మన్ రూపొందించిన ఈ సినిమాతో నాగ్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనే విషయాలు రివ్యూ లో తెలుసుకుందాం…

కథ
పూణేలోని ఒక బేకరీలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఈ బ్లాస్ట్‌లో విదేశీయులతో పాటు చాలా మంది చనిపోతారు. అయితే, ఈ బ్లాస్ట్ ఎవరు చేశారు అనే విషయంలో పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకదు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎన్ఐఏ మాజీ అధికారి విక్రమ్ వర్మ అలియాస్ బ్లాక్ డాగ్ (నాగార్జున)ను ప్రభుత్వం రంగంలోకి దించుతుంది. విక్రమ్ వర్మ తన టీమ్‌తో కలిసి ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు? ఆయన ఇన్వెస్టిగేషన్‌లో బయటపడిన విషయాలు ఏంటి? ఈ బ్లాస్ట్‌ చేసిన టెర్రరిస్ట్‌ను బ్లాక్ డాగ్ టీమ్ ఎలా పట్టుకుంది? వంటి విషయాలను తెరపై చూడాల్సిందే.

 

మైనస్ పాయింట్స్ :
ఎన్‌ఐఏ బృందం సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులను ఏరివేసే నేపథ్యంలో ‘వైల్డ్ డాగ్’ కథ సాగుతుంది. ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌ను పట్టుకోవడానికి ఎన్ఐఏ చేపట్టిన ఆపరేషన్ ఆధారంగా నిజజీవిత ఘటనలతో ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు అహిషోర్ సాల్మన్. దర్శకుడిగా సాలోమ‌న్‌ మంచి కథా నేపథ్యం రాసుకున్నప్పటికీ ఆసక్తికరమైన కథనంతో సినిమాని ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయారు. అక్కడక్కడ స్లోగా నడిచే సన్నివేశాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

Wild Dog Telugu Movie Review And Rating

- Advertisement -

నెరేషన్ ఇంకాస్త బాగుండి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. పైగా ఈ చిత్రం చూస్తున్నంత సేపు హిందీ వెబ్ సిరీస్ లు గుర్తుకువస్తాయి. అన్నిటికీ మించి సినిమాలో గుర్తు ఉండిపోయే ఒక్క ఎమోషన్ కూడా బలంగా ఎలివేట్ కాలేదు. ఫస్టాఫ్‌లో కొత్తదనం పెద్దగా కనిపించదు. ఇన్వెస్టిగేషన్ సాదాసీదాగా వెళ్తున్నట్టే ఉంటుంది. అయితే, కొన్ని సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. పైగా ఈ చిత్రంలో చాలా తేలికపాటి ఇన్విస్టిగేషన్ తోనే ముగించడం అంతగా రుచించదు.

ప్లస్ పాయింట్స్ :
టెర్రరిస్ట్ ఖాలిద్‌ను పట్టుకోవడానికి విక్రమ్ వర్మ టీమ్ చేసే ప్రయత్నం.. ఖాలిద్ తెలివిగా తప్పించుకోవడం వంటి సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. వైల్డ్ డాగ్ విజయ్ వర్మగా ఈ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ పాత్ర‌లో తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. నాగ్ అగ్రెసీవ్ బాడీ లాంగ్వేజ్, డామినేట్ చేసే క్యారెక్టరైజేషన్ మాడ్యులేషన్ తో తన పాత్రకు ఫర్ఫెక్ట్ గా సరిపోయాయి.

ఇప్పటికే ‘గగనం’లో ఎన్ఎస్‌జీ కమాండోగా నాగార్జునను చూశాం. ఇప్పుడు ఎన్ఐఏ అధికారిగా ఆయన కనిపించారు. 60 ఏళ్లు పైబడినా అలీరెజా లాంటి కుర్రాళ్లతో పోటీపడి నటించారు. నేపాల్ లో రా ఏజెంట్ గా స‌యామీ ఖేర్‌ బాగా ఫిట్ అయింది. యాక్షన్ సీన్స్ లోనూ సయామీ ఎనర్జిటిక్ గా నటించింది. ఇక భార్య పాత్రలో ఓకే ఎమోషన్ తో సాగే దియామీర్జా నటన కూడా పరవాలేదనిపిస్తోంది.

రా ఏజెంట్‌గా ఆమె తన ధైర్య సాహసాలను చూపించారు. ఇక అలీరెజాకు మంచి రోల్ దక్కింది. తన పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశారు. అతుల్ కులకర్ణి, దయానంద్ రెడ్డి, అనీష్ కురువిల్లా, అవిజిత్ దత్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. దర్శకుడు సాలోమ‌న్‌ రాసిన ఈ చిత్ర కథలోని మెయిన్ పాయింట్ ఆకట్టుకుంటుంది. సినిమాలోని కొన్ని సంఘటనలు సమాజంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుకు తెస్తాయి.

Wild Dog Review And Rating

సాంకేతిక విభాగం :
సినిమా టెక్నికల్‌గా చాలా రిచ్‌గా ఉంది. షానియల్ డియో సినిమాటోగ్రఫీ, తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్లు. నేపాల్-ఇండియా బార్డర్ సన్నివేశాలు, అడవిలో ఉగ్రవాదుల వేట వంటి సీన్స్‌ను తన కెమెరాలో అద్భుతంగా బంధించారు షానియర్ డియో. ఇక తమన్ తన నేపథ్య సంగీతంతో ప్రతి సన్నివేశానికి ప్రాణం పోశారు.

దర్శకుడు మంచి స్టోరీ ఐడియా తీసుకున్నారు గాని, ఆ ఐడియాకు తగ్గట్టు అంతే కొత్తగా ట్రీట్మెంట్ మాత్రం రాసుకోలేదు. సినిమాలో సప్సెన్స్ ఇంట్రస్ట్ పెంచే స్కోప్ ఉన్నప్పటికీ ప్లే సింపుల్ గా హ్యాండల్ చేశారు. సినిమా నిడివి తక్కువగా ఉండటం కూడా ఒక ప్లస్ పాయింట్. సినిమాను రెండు గంటలకు కుదించి తన పాత్రకు న్యాయం చేశారు ఎడిటర్ శ్రావణ్.

తీర్పు :
ఈ సినిమాలో ఇంట్రెస్ట్ గా సాగే ట్రీట్మెంట్ తో పాటు కొన్ని ఇన్విస్టిగేషన్ తో సాగే సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే నాగార్జున నటన అండ్ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక నాగ్ టీమ్ మెంబర్స్ పెర్ఫామెన్స్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. కథనంలో నెమ్మది మినహా ఆపరేషన్ ‘వైల్డ్ డాగ్’ను మీరు ఎంజాయ్ చేస్తారు.

 

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles