Akkineni Nagarjuna’s Naa Saami Ranga Heroines Fix, Nagarjuna new movie, Tollywood, Naa Saami Ranga shooting update, Tollywood, Akkineni Nagarjuna, Ashika Ranganath, Manasa Varanas heroines,
టాలీవుడ్ లో కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా ఆరుపదుల వయసులో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే సీనియర్ హీరోలలో నాగార్జున ఈ వయసులో కూడా ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన నా సామి రంగ అనే సినిమాతో సంక్రాంతికి రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
నా స్వామి రంగా సినిమాని ప్రకటించినప్పుడు టీజర్ ని విడుదల చేయడం జరిగింది. . టీజర్ లో నాగార్జున ఫుల్ మాస్ క్యారెక్టర్ చేస్తున్నట్టు అర్థమైంది అయితే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల విషయంలో ఎటువంటి ప్రకటన రాలేదు. విజయ్ బన్నీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు నాగార్జునకి జోడిగా ఇద్దరు ముద్దుగమ్మలు హీరోయిన్స్ గా చేయబోతున్నట్టు తెలుస్తుంది. వీరులో ఆషిక రంగనాథ్ ( Ashika Ranganath ) మొదటి హీరోయిన్ కాగా మరొకరు మిస్ ఇండియా భామ మానస వారణాసి అని టాక్. దీనిపై ఇంకా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటన చేయాల్సి ఉంది.

ఈ సినిమాని మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించడమే కాకుండా సంక్రాంతికి విడుదల చేయడానికి అన్ని రకాల ప్లాన్ చేస్తున్నారు.సంక్రాంతికి విడుదలైన బంగారురాజు సినిమా అనుకున్నంత స్థాయిలో బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయేటప్పుడికి నాగార్జున రాబోయే సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలని ఈ సినిమా విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది.