‘మర్డర్’ కేసులో ఆర్జీవీకి కోర్టు షాక్..!

0
269
Nalgonda Court Shock To Rgv On Murder Movie Release

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కోర్టు షాకిచ్చింది. వర్మ రూపొందిస్తున్న ‘మర్డర్’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. నల్గొండలో జరిగిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా వర్మ ‘మర్డర్’ సినిమా రూపొందిస్తున్నట్లు ఆయన ట్విట్టర్‌ పోస్టులను, సినిమా టీజర్‌ను బట్టి చూస్తే అర్థమవుతుంది.అయితే ఈ సినిమా తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ప్రణయ్ భార్య అమృత, తండ్రి బాలస్వామి కోర్టును ఆశ్రయించారు.

తమ కుటుంబాన్ని సంప్రదించకుండా ఫొటోలు, పేర్లు వాడుకుంటున్నారంటూ.. అలాగే ప్రశాంతంగా ఉన్న తమ బ్రతుకులను వర్మ బజారుకీడ్చే ప్రయత్నం చేస్తున్నాడంటూ వర్మపై, మర్డర్ మూవీపై కంప్లైంట్ చేశారు. ఈ సినిమా టీజర్, పోస్టర్స్ చూస్తుంటే తమ కులాన్ని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు. అదేవిధంగా హత్యకేసు విచారణ ఉన్న ఈ దశలో కల్పిత కథతో ఇలాంటి సినిమా వచ్చిందంటే అది సాక్షులపై వ్యతిరేక ప్రభావం పడే ఛాన్స్ ఉందని వారు పేర్కొన్నారు.

ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ‘మర్డర్’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో అమృత తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అయితే నల్గొండ జిల్లా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వులపై హైకోర్టుకు వెళతామంటు వర్మ తరపు న్యాయవాది తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here