Sitara and Gautham Debut Dreams Revealed: సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత ముద్దుల బిడ్డ సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు స్టడీస్ మరోవైపు సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. అలాగే మహేష్ పెద్ద కొడుకు గౌతమ్ కూడా ప్రస్తుతం స్టడీస్ మీద ఫోకస్ చేస్తున్నారు. మరోవైపు సితార మహేష్ సినిమాలో కనపడగా అలాగే రీసెంట్గా ఒక జ్యూవెలరీ యాడ్ కూడా చేయడం జరిగింది. ఆ జ్యూవెలరీ యాడ్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై మెరిసింది.
Sitara and Gautham Debut Dreams Revealed: అయితే రీసెంట్గా ఈ జువెలరీ యాడ్ కి అటెండ్ అయిన సితార అలాగే నమ్రత ఇద్దరి సినీ ప్రస్థానం గురించి క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే, మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ప్రస్తుతం పలు సోషల్ మీడియా అకౌంట్స్ మైంటైన్ చేస్తూ అలాగే తన కొచ్చిన యాడ్స్ తో టాలీవుడ్ లో పాపులారిటీ పెంచుకుంది, అలాగే సితార మంచి డాన్సర్ కూడా.. చాలాసార్లు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వీడియోస్ ని విడుదల చేయటం మనం చూసిన విషయమే.
తనకి సినిమాల్లోనూ.. అలాగే సినిమాలంటే ఎంత ఇష్టమో దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఫ్రోజెన్ 2′ సినిమా తెలుగు వర్షన్ కి సితార వాయిస్ ఓవర్ కూడా అందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది అది ఏమిటంటే, రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మహేష్ బాబు సినిమా SSMB29 లో సితార కూడా చేయబోతున్నట్టు వార్తలైతే హల్చల్ చేస్తుంది. ఇక రీసెంట్ గా సితార చేసిన జువెలరీ యాడ్ కి నమ్రత కూడా రావటం జరిగింది.
సితార నటించిన ఈ యాడ్ కి దాదాపు కోటి రూపాయల వరకు రెమినేషన్ తీసుకున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. దీని గురించి సితార మాట్లాడుతూ..ఫస్ట్ రెమ్యునరేషన్ ఎవరికి ఇచ్చారు? అని అడగగా.. చారిటీ ట్రస్ట్ కు ఇచ్చినట్లు తెలిపింది. దీని తర్వాత సితార సినిమాల్లోకి వచ్చే విషయమై నమ్రత మాట్లాడుతూ..

“సరైన మార్గదర్శకులు మంచి వ్యక్తుల మద్దతు ఉంటే ఇండస్ట్రీ ఎంతో అందమైన ప్రదేశం. కానీ ఇక్కడ చాలామందికి చిత్ర పరిశ్రమ అంటే మంచి అభిప్రాయం లేదు. మా పిల్లలను మేం ప్రోత్సహిస్తూనే ఉంటాం. సితార సినిమాల్లోకి వస్తానంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. గౌతమ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. అతడు సినిమాల్లోకి రావడానికి దాదాపు ఎనిమిదేళ్ల వరకు పట్టే అవకాశం ఉంది. సితార నటించిన జ్యువెలరీ యాడ్‌ను మహేశ్ కు ఎంతో బాగా నచ్చింది. రిపీట్ మోడ్‌లో చూస్తూనే ఉన్నారు. ఇది ఓ ఎమోషనల్ మూమెంట్” అని తెలిపారు.