‘అఖండ’ బాలకృష్ణ రీస్టార్ట్‌ చేసిన సినిమా పనులు..!

0
2611
Nandamuri Balakrishna Akhanda Movie shooting Updates

Akhanda Shooting: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆశగా చూస్తున్నారు.

నిన్నటి వరకు అభిమానుల్లో ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. అంతేకాదు ‘అఖండ’ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు అనే ప్రశ్న కూడా వినిపించేది. ఇక ఎదురుచూపులకు చెక్‌ పడింది. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ సినిమా పనులు రీస్టార్ట్‌ అయ్యాయి. అయితే ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చినా, చిత్ర యూనిట్ ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్‌ను ముగించేసింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు చిత్ర యూనిట్.

సినిమా డబ్బింగ్‌ పనులను బాలకృష్ణ ఇటీవల ప్రారంభించారట. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఓవైపు డబ్బింగ్‌ జరుగుతుండగా, దర్శకుడు బోయపాటి మిగిలిన పనులు మరోవైపు తేలుస్తారట.

Nandamuri Balakrishna Akhanda Movie shooting Updates

ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, అందాల భామ ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరో బ్యూటీ పూర్ణ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.