‘డిక్టేటర్’ డైరెక్టర్ తో సినిమాకి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ?

0
1591
Nandamuri Balakrishna and dictator Director Sriwass another film confirmed

ఒకసారి తనకి హిట్ ఇచ్చిన దర్శకులకు మళ్లీ అవకాశం ఇవ్వడం బాలకృష్ణకి అలవాటు. ఒకవేళ హిట్ ఇవ్వకపోయినా, తన క్రేజ్ కి తగిన విధంగా కొత్తగా చూపించిన దర్శకులకు తిరిగి అవకాశాన్ని ఇవ్వడానికి ఆయన ఆలోచించడు. ఈ కారణంగానే ఇప్పుడు దర్శకుడు ‘శ్రీవాస్’కి మళ్లీ ఛాన్స్ వచ్చిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. మాస్ ఎంటర్ టైనర్ సినిమాలను శ్రీవాస్ చక్కగా డీల్ చేయగలడు అంటూ ఇప్పటికే నిరూపితం అయ్యింది. దర్శకుడు శ్రీవాస్ ఇంతకుముందు బాలకృష్ణతో ‘డిక్టేటర్’ సినిమా చేశాడు. స్టార్ రైటర్ గా పేరు దక్కించుకున్న కోన వెంకట్ నిర్మాతగా మారి వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు.

ఇదే సమయంలో కథ తయారు చేసి దానికి సరైన న్యాయం చేస్తారనుకున్న దర్శకుల చేతిలో సినిమాను పెట్టి వెనుక ఉండి కోన సినిమాను ముందుకు తీసుకు వెళ్తున్నాడు. ఇక స్క్రీన్ ప్లేను పట్టుగా నడిపించడంలోను .. సంభాషణలతో అలరించడంలోను ఆయన సిద్ధహస్తుడు. అలాంటి కోన వెంకట్ .. బాలకృష్ణ కోసం ఒక కథను సిద్ధం చేశాడట. ఇటీవలే ఆయన బాలకృష్ణను కలిసి కథను వినిపించడం .. వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. యాక్షన్ .. ఎమోషన్ తో పాటు, కోన స్టైల్ కామెడీ కూడా ఉండటంతో ఈ కథను బాలకృష్ణ ఓకే చేశాడని చెబుతున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 2022లో వీరి కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు రావచ్చు అంటున్నారు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. యాక్షన్ ప్రధానంగానే ఈ సినిమాను బోయపాటి తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. గతంలో బోయపాటి – బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’ .. ‘లెజెండ్’ సినిమాలు రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టాయి. మాస్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్న ఈ రెండు సినిమాలు, బాలకృష్ణ కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచిపోయాయి.