లోకల్‌, నాన్‌ లోకల్‌ చూడను.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..!

0
38
Balakrishna Sensational Comments on MAA Elections

Balakrishna: ‘మా’ ఎన్నికల విషయంలో లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే అంశాన్ని పట్టించుకోను అని ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (MAA) ఎన్నికల గురించి నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ‘మా’ బిల్డింగ్‌ ఎందుకు కట్టలేకపోతున్నారని కమిటీ సభ్యులను నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు, మా భవనం కోసం అడిగితే ఒక ఎకరం ఇవ్వదా అని ఆయన ప్రశ్నించారు.

‘‘గతంలో ‘మా’ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాలు అంటూ… ఫస్ట్‌ క్లాస్‌ టికెట్లు వేసుకొని విమానాల్లో తిరిగారు. ఆ డబ్బులు ఏం చేశారు’’ అని బాలయ్య ప్రశ్నించారు. తెలంగాణ సర్కారు నుంచి ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారా అని ఎద్దేవా చేశారు. అసోసియేషన్ ఎన్నికల్లో అర్టిస్టులు అందరూ సమానమేనన్నారు.

‘మా’బిల్డింగ్‌ నిర్మాణం కోసం మంచు విష్ణు ముందుకొస్తే, తాను సహకరిస్తానని చెప్పారు. సినీ పెద్దలంతా కలిసి వస్తే.. ఇంద్రభవనం నిర్మించుకోవచ్చని బాలయ్య అన్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న మనమంతా.. బహిరంగంగా చర్చించుకోవడం సరికాదన్నారు.

Watch Balakrishna MAA election Video