హైదరాబాద్ వరద బాధితులకు అండగా బాలకృష్ణ.. !

0
420
nandamuri balakrishna reportedly announces one and half crore rupees donation to hyderabad flood victims

Nandamuri Balakrishna: గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ను వర్షభీభత్సం ముంచేస్తుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భాగ్యనగర వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్ళ మధ్యలోంచి వరదలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా పాతనగరం అల్లకల్లోలంగా మారింది. నాలాలు పొంగి పొర్లడం, చెరువులకు గండ్లు పడటంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇలాంటి సమయంలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా తనవంతు సాయం చేస్తుంది. అయితే, నటసింహా నందమూరి బాలకృష్ణ రూ. 1.5 కోట్ల విరాళం ప్రకటించారని సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాంతో పాటు ఇటీవల జరిగిన రోడ్డు పక్కనున్న నివాసాలు పూర్తిగా వర్షపు నీరుతో కొట్టుకుపోయిన వాళ్లకి అండగా నిలిచాడు నందమూరి బాలకృష్ణ.

కానీ, బాలయ్య భారీ విరాళాన్ని ప్రకటించారని సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేస్తున్నారు. బాలయ్య మనసు బంగారం అని అంటున్నారు. అంతేకాదు, బసవ తారకరామ సేవా సమితి ద్వారా పాతబస్తీలోని 1000 కుటుంబాలకు ఆహార పొట్లాలను కూడా అందజేస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు ఇంకా ఏదైనా అవసరం కావాలన్నా కూడా తాను ముందుంటానని బాలయ్య హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. బాలయ్య మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో మిగిలిన హీరోలు కూడా ఆర్థిక సాయం చేయడానికి ముందుకొస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.