మూవీ రివ్యూ : “రూలర్” రొటీన్ ఊర మాస్ రూలర్‌

1451
Nandamuri Balakrishna Ruler Movie Review and Rating
Nandamuri Balakrishna Ruler Movie Review and Rating

Nandamuri Balakrishna Ruler Movie Review and Rating

రిలీజ్ డేట్‌: 20 నవంబర్‌, 2019
టైటిల్‌: రూలర్‌
రేటింగ్ : 2/5
నటీనటులు: బాలకృష్ణ, సోనాల్ చౌహాన్‌, వేదిక, భూమిక, ప్రకాష్‌రాజ్‌, జయసుధ తదితరులు
కథ, మాటలు: పరుచూరి మురళీ
మ్యూజిక్‌: చిరంతన్ భట్‌
నిర్మాత: సీ కళ్యాణ్‌
దర్శకత్వం: కేఎస్‌.రవికుమార్‌

యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో 105వ సినిమాగా తెరకెక్కింది రూలర్‌. శాతకర్ణి తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం వెయిట్ చేస్తోన్న బాలయ్యకు ఎన్టీఆర్ బయోపిక్ రెండు సినిమాలు పీడకలను మిగిల్చాయి. ఈ రెండు సినిమాల తర్వాత బాలయ్య నటిస్తోన్న రూలర్‌పై బాలయ్యతో పాటు ఆయన అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. సోనాల్ చౌహాన్ మరియు నివేదికలు హీరోయిన్లుగా నటించిన పవర్ ఫుల్ యాక్షన్ చిత్రం “రూలర్”. బాలయ్య వర్కింగ్ స్టిల్స్ తోనే మంచి హైప్ ను తీసుకొచ్చిన ఈ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రూలర్‌తో బాలయ్య రూల్ చేశాడా ? లేదా ? అన్నది సమీక్షలో చూద్దాం.

కథ :

యూపీలో తెలుగు రైతులు 2 వేల ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకునేందుకు యూపీ ప్రభుత్వం అనుమతిస్తుంది. ఠాగూర్ వంశానికి చెందిన భవానీ ఠాగూర్ అక్కడ రెవెన్యూ మంత్రిగా ఉంటాడు. అన్న ప్రకాష్‌రాజ్ కుమార్తె భూమిక తక్కువ కులానికి చెందిన వాడిని పెళ్లాడుతుంది. భూమిక భర్తను చంపేసిన మంత్రి భవానీ అన్న, అన్న కుమార్తెను చంపాలనుకుంటాడు. వాళ్లకు అక్కడ తెలుగు రైతులు అండగా ఉంటారు. ఆ తెలుగు రైతులు సాగు చేసుకుంటోన్న భూముల జీవోను రద్దు చేయిస్తాడు మంత్రి. తీవ్రమైన గాయాలతో దొరికిన బాలయ్యను పెద్ద వ్యాపారవేత్త అయినటువంటి జయసుధ చేరదీసి తన వ్యాపార లావాదేవీలకు అండగా ఉండాలని అతన్ని కూడా అతనికి ఓ గతం ఉంది అని తెలీకుండా పెద్ద బిజినెస్ మాగ్నెట్ గా మార్చేస్తుంది.

ఈ క్రమంలోనే తెలుగు రైతుల కుటుంబానికి చెందిన పోలీస్ ఆఫీసర్ ధర్మ (బాలయ్య) మంత్రికి ఎదురొడ్డి నిలుస్తాడు ? ఈ క్రమంలోనే చివరకు కథకు హైదరాబాద్‌లోని ఏషియన్ సాఫ్ట్‌వేర్ అధినేత అర్జున ప్రసాద్ (బాలయ్యకు) లింక్ ఏంటి ? ఈ కథలో హీరోయిన్లు సోనాల్ చౌహాన్‌, వేదిక రోల్ ఏంటి ? చివరకు యూపీలో తెలుగు రైతులకు న్యాయం జరిగిందా ? ధర్మ, అర్జున్ ప్రసాద్ ఒక్కరేనా ? వేర్వేరా ? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

బాలయ్య పెర్ఫామెన్స్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ కథ
ఊహించదగ్గ కథనం
బాలయ్య పోలీస్ లుక్స్

విశ్లేషణ :

దర్శకుడు కేఎస్‌.రవికుమార్ ఎప్పుడో బీసీ కాలం నాటి కథను తీసుకుని.. దానికి యూపీ బ్యాక్ డ్రాప్ జోడించి తన పాత సినిమాలతో పాటు బాలయ్య పాత సినిమాల్లో సీన్లను మిక్స్ చేసి రసం తీసి ఈ సినిమా తీసేశాడు. కథ, కథనాలు ఎంత మాత్రం ఆకట్టుకోలేదు. ఉన్నంతలో బాలయ్య ఎనర్జీతో చెప్పే డైలాగులు, పాటలకు వేసిన స్టెప్పులు బాగున్నాయి. అయితే కె ఎస్ రవికుమార్ తో చేసిన “జై సింహా”తో బోయపాటి రేంజ్ హిట్ అనకపోయినా మిగతా ప్లాప్ చిత్రాలను మించి హిట్ చిత్రాన్ని బాలయ్యకు అందించిన ఏకైక దర్శకునిగా రవికుమార్ నిలిచారు.అదే నమ్మకంతో ఇప్పుడు “రూలర్”తో ఇంకో అవకాశాన్ని ఇచ్చారు.

సినిమాలో బాలయ్య ఎనర్జీని వదిలేస్తే చెప్పుకునేందుకు ఏ ఒక్క హైలెట్ కూడా లేదు. హీరోయిన్లు అందంగా కనిపించారు. సోనాల్ బికినీ ట్రీట్ బాగుంది. అయితే ఈ సినిమాకు బాలయ్య టోనీ స్టార్క్ లుక్ తోనే విపరీతమైన క్రేజ్ సంతరించుకున్నారు.అలా ఈ సరికొత్త లుక్ లో మాత్రం సిల్వర్ స్క్రీన్ పై బాలయ్య స్టైలిష్ అల్ట్రా లుక్ లో అదరగొట్టారని చెప్పాలి.ఫస్ట్ హాఫ్ లో బాలయ్యపై వచ్చే ఈ మేకోవర్ సీన్స్ మరియు కొన్ని మార్క్ పంచ్ డైలాగ్స్ బాలయ్య నుంచి ఏమైతే కోరుకొని థియేటర్ కు జనం వాస్తారో వారికి ఫుల్ మీల్స్ లా ఉంటుంది.

దర్శకుడు ఏమాత్రం ఆసక్తికరంగా ఉండని రొటీన్ ట్విస్ట్ తో సినిమా ఫ్లోకు దెబ్బేసారు.అలాగే సెకండాఫ్ కు వచ్చేసరికి టాలీవుడ్ కీ కమెడియన్స్ తో ఫస్ట్ హాఫ్ లోలానే సెకండాఫ్ లో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించే ప్రయత్నం చేసారు.కానీ అక్కడ నుంచే కథ కథనం రొటీన్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే రైతులకు సంబంధించిన ఎపిసోడ్స్ కానీ బాలయ్యతో చెప్పించిన డైలాగ్స్ కానీ బాగుంటాయి. చివరకు బాలయ్య అభిమానుల్లో కూడా ఈ సినిమా అందరికి నచ్చుతుందా ? అన్నది డౌటే.

ఫైనల్‌గా..బాలయ్య మార్క్ పరమ రొటీన్ ఊర మాస్ రూలర్‌