కరోనా వైరస్‌ గురించి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

0
449
Nandamuri Balakrishna Talks About Coronavirus In Sehari First Look Luanch Event-min

నందమూరి బాలకృష్ణ సోమవారం ‘సెహరి’ సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన బాలకృష్ణ కరోనా వైరస్‌ కారణంగా సినీ ఇండస్ట్రీ పడుతున్న ఇబ్బందులు, మనుషులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి వివరిస్తూ కొన్ని సూచనలు కూడా చేశారు. కరోనా వైరస్ విషయంలో అశ్రద్ధ వద్దని.. చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ.

‘‘కరోనా సమయంలో చదువు వచ్చిన వాళ్లకి, రాని వాళ్లకు నేను ఎన్నో చెప్పాను. చాలా మంది చెప్తారు.. భక్తి ఛానెల్ అని, ఆధ్యాత్మికత అని రోట్లో వేసి దంచుతారు. బాబూ పొద్దున్నే లేచి చల్లని నీళ్లతో తలస్నానం చేయండి అని చెప్తారు. చస్తే చేయొద్దు. వాళ్ల మాటలు ఎవ్వరూ వినకండి. కరోనా అన్నది నుమోనియాకు సంబంధించినది. అదొక లిపిడ్ ప్రొటీన్. అది పరివర్తనం చెందుతూ ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు దానికి వ్యాక్సిన్ రాలేదు రాదు కూడా. నేను కచ్చితంగా చెబుతున్నాను. దాని గురించి నాకు తెలుసు. కరోనా అన్నది మనషి మనసును కన్‌ఫ్యూజ్ చేస్తుంది’’ అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

కరోనా వైరస్‌ ఎంత మంది ప్రాణాలను బలిగొంటుందో చూస్తూనే ఉన్నాం. కాబట్టి తగు జాగ్రత్తలు పాటిస్తూ శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మనం బలంగా ఉండాలి. మన జీవితంలో కరోనా ఓ భాగమైపోతుందేమోననిపిస్తుంది” అన్నారు . ఇలాంటి కరోనా సమయంలోనూ ధైర్యంగా షూటింగ్ చేస్తున్న ‘సెహరి’ టీమ్‌ను ఆయన అభినందించారు.