నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్..వరుస సినిమాలతో..!

0
97
Nandamuri family Balakrishna NTR and Kalyan Ram Movies

NTR – Balakrishna – Kalyan Ram: టాలీవుడ్ లో మరో పెద్ద ఫ్యామిలీ నందమూరి వారిది. ఎన్టీయార్ నట వారసుడిగా బాలయ్య (Balakrishna) రంగ ప్రవేశం చేశారు. నాలుగు దశాబ్దాలు అయినా నాటౌట్ అంటున్నారు. వందకు పైగా సినిమాలతో బాలయ్య తనదైన మార్క్ ని ఇప్పటికీ చూపిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ (NTR) కూడా తనదయిన మార్కెట్ తో దూసుకు వెళ్తున్నాడు.

కరోనా నేపథ్యంలో దాదాపు రెండు సంవత్సరాలపాటు పెద్ద సినిమా ఏది కూడా రాలేదు. ఇదే తరుణంలో నందమూరి హీరోలకు సంబంధించి దాదాపు రెండు సంవత్సరాలపాటు ఏ సినిమా కూడా రిలీజ్ కాని పరిస్థితి. ప్రస్తుతం 50% సిట్టింగ్ తో థియేటర్లు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఎప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ చేయటానికి ముందుకు వస్తున్నారు.

ఇప్పటికే నందమూరి బాలయ్య బాబు బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న అఖండ (Akhanda) టీజర్ రిలీజ్ అయ్యి.. సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించడం జరిగింది. అదే రీతిలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) RRR సినిమాకి సంబంధించి లుక్కు కూడా రిలీజ్ అయ్యి భారీ రికార్డులు సృష్టించింది.

Nandamuri Kalyan Ram Next NRK21 title announcement poster

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) తన 21 వ సినిమాతో బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఏజెంట్ వినోద్ టైటిల్ అండ్ ప్రీ లుక్ నందమూరి అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కి సోమవారం ముహూర్తం ఫిక్సయ్యింది.