Homeసినిమా వార్తలునా మాట తీసుకోండి..‘డెవిల్’ సినిమా చాలా బావుంటుంది: కళ్యాణ్ రామ్

నా మాట తీసుకోండి..‘డెవిల్’ సినిమా చాలా బావుంటుంది: కళ్యాణ్ రామ్

Nandamuri Kalyan Ram About Devil Movie at Devil Trailer Release event, Kalyan ram Revealed NTR's Devara Teaser Details. Devil Movie Trailer

Nandamuri Kalyan Ram about Devil Movie: వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందిన డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర యూనిట్ ట్రైలర్‌ను (Devil Trailer) విడుదల చేసింది.

Nandamuri Kalyan Ram about Devil Movie: హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘మంచి కథ, విజువల్స్, మ్యూజిక్ ఉండి.. దానికి తగ్గ టీమ్ వర్క్ చేసినప్పుడు ఆడియెన్స్ థియేటర్స్‌కి వద్దన్నా వస్తారని బింబిసార సమయంలో చెప్పాను. దాన్ని మీరు నిజం చేశారు. అదే కోవలో డెఫనెట్‌గా డెవిల్ మంచి కథ, కథనాలతో మీ ముందుకు వస్తుంది. విజువల్స్ ఎలా ఉంటాయనేది ట్రైలర్‌లో (Devil Trailer) చూశారు.

కథను తయారు చేసుకున్న శ్రీకాంత్, అద్బుతమైన విజువల్స్ అందించిన సౌందర్ రాజన్‌గారు, అలాగే వెంకట్ మాస్టర్, రామకృష్ణ మాస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ గారు, 1940 బ్యాక్ డ్రాప్ లో చేయాల్సిన ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని తయారు చేసిన గాంధీగారికి థాంక్స్. వీటన్నింటినీ కలిపి ఇలా చూస్తే బావుంటుందని ఆలోచించి ఖర్చుకి వెనుకాడకుండా సినిమాను గొప్పగా రూపొందించిన అభిషేక్ నామాగారికి థాంక్స్.

ఇలా అందరూ వెనకుండి మా ఆర్టిస్టులందరినీ నడిపించారు. సినిమా అనేది ఓ టీమ్ ఎఫర్ట్. దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే వచ్చే ఆనందమే వేరు. డిసెంబర్ 29న డెవిల్ మీ ముందుకు వస్తుంది. నా మాట తీసుకోండి.. రాసుకోండి.. సినిమా చాలా బావుంటుంది. మీకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్త కథతో డెవిల్ సినిమా ఉంటుంది. బింబిసార 2ను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి మొదలు పెడతాం.

Kalyan Ram Revealed NTR's Devara Teaser Details

Kalyan Ram Revealed NTR’s Devara Teaser Details

తమ్ముడు ఎన్టీఆర్ (NTR) సినిమా దేవర (Devara) గురించి చెప్పాలంటే.. RRR వంటి సినిమా చేసిన తర్వాత ఓ యాక్టర్‌కి, ఓ డైరెక్టర్‌కి, ప్రొడక్షన్ హౌస్‌కి గాని ఎంతో బాధ్యత ఉంటుంది. చిన్నపాటి తప్పు జరిగినా ఎవరూ ఊరుకోరు. మేం తెలిసి తప్పు చేయం. బాధ్యతగా తీసుకుని ఎంత కష్టపడతామో మాకు తెలుసు. రేపు థియేటర్స్‌లో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. త్వరలోనే గ్లింప్స్ (Devara Glimpse) రాబోతుంది. దానికి కావాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. వి.ఎఫ్.ఎక్స్‌కి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మేం దేవర మూవీ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. దయచేసి ఓపిక పట్టండి. త్వరలోనే గ్లింప్స్ డేట్‌ను టీమ్ అనౌన్స్ చేస్తుంది.. డిసెంబర్ 29న డెవిల్ ను చూసి ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.

- Advertisement -

 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY