Nandini Reddy revealed Prabhas Project K Story: ప్రభాస్ ప్రస్తుతం అయినప్పుడు పెట్టిన అన్ని మూవీస్ లో ఫాన్స్ ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. పాన్ వరల్డ్ మూవీ అని ఇప్పటికే చిత్ర యూనిట్ భారీగా ప్రచారం చేయడంతో పాటు రిలీజ్ కి ముందే మూవీ మీద హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమాలో తారాగణం కూడా భారీ రేంజ్ లో ఉండడంతో పాటు బడ్జెట్ అంతకంటే భారీగా ఉంది. పైగా సినిమాలోని ప్రతి ఎలిమెంట్ అద్భుతంగా ఉంటుంది అని ఇప్పటికే అందర్నీ నోరూరిస్తోంది చిత్ర బృందం.
Nandini Reddy revealed Prabhas Project K Story: ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కూడా బాహుబలి తరువాత ఈ చిత్రం తిరిగి అంతటి రికార్డును సృష్టిస్తుంది అని ఆశిస్తున్నారు. ప్రాజెక్ట్ కే మూవీలో విభిన్నమైన టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉంటుందట. ఈ మూవీని అశ్విని దత్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే అశ్వినీత కూతురు అయిన నందిని రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన అన్ని మంచి శకునంలే మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఆమె మీడియాతో సమావేశం అయ్యారు.
మీడియా సమావేశంలో ప్రాజెక్ట్ కే (ProjectK Story) గురించి నందిని రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వైరల్ అయింది. ప్రాజెక్ట్ కే గురించి నాకు సరిగ్గా తెలియదు కానీ అది ఒక గేమ్ చేంజెస్ సినిమా అవుతుంది అని మాత్రం కచ్చితంగా తెలుస్తుంది అని నందిని అన్నారు. నిజానికి జురాసిక్ పార్క్ మూవీలో డైనోసార్ ఎంట్రీ టైంలో ప్రేక్షకులలో ఎలాంటి ఉత్కంఠత మరియు గూస్ బంప్స్ క్రియేట్ అవుతాయో ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు అదే అనుభూతి కలుగుతుంది అని నందిని రెడ్డి అన్నారు.
ప్రస్తుతం ఆమె ఇచ్చిన హింట్ తో ప్రాజెక్ట్ కే (ProjectK Story) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఓ పక్క తనకు మూవీ గురించి పెద్దగా తెలియదు అంటూనే మరోపక్క ఊరించి వెళ్ళింది నందిని. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్, దీపికా పదుకొనే నటిస్తున్నారు.
ప్రభాస్ (Prabhas) మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఆది పురుష్ జూన్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీరాముని కథ ఆధారంగా,విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇవే కాక ఇంకో నాలుగు సూపర్ ఎక్సైటింగ్ చిత్రాలు ప్రభాస్ లైన్ అప్ లో ఉన్నాయి. అన్ని హిట్ కొట్టాయం అంటే ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ అవడం ఖాయం.
Web Title: Nandini Reddy revealed Prabhas Project K Story, Prabhas, Deepika Padukone, Project K story, Project K release date, Project K shooting update, Nag Ashwin