Nani 28 Nazirya Nazim film titled as Ante Sundharaniki locked

Nani 28 Ante Sundharaniki : నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు…నేచురల్‌ స్టార్‌ నాని, వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. నాని 28వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా కర్టెన్‌ రైజర్‌ను శనివారం చిత్ర యూనిట్‌ విడుదల చేసి.. సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఒరిజినల్ స్టోరీతో మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని – రవిశంకర్ వై. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Nani next movie titled Ante Sundharaniki locked

నాని 28వ చిత్రానికి ‘అంటే సుందరానికీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ క్రేజీ వీడియోకి సినీ అభిమానుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. హర్షవర్ధన్‌, సుహాస్‌ మధ్య ఏదో సీక్రెట్‌ డిస్కషన్‌ జరిగినట్లు చూపిస్తూ.. ఆసక్తికరంగా టైటిల్‌ ‘అంటే సుందరానికీ’ అని రివీల్‌ చేశారు. ఇందులో నాని లగేజ్‌ బ్యాగ్‌ పట్టుకుని అటు తిరిగి నిలుచున్నాడు. పల్లెటూరి వ్యక్తిగా పంచెకట్టుతో కనిపిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ‘అంటే.. సుందరానికీ!’ సినిమా 2021లో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచనుందని స్పష్టం అవుతోంది.

ఇక ఈ సినిమాతో మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా ఫహాద్ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. ఇంతకు ముందు తన సినిమాలో చూడని లవ్‌, నవ్వులను ఈ సినిమాలో చూస్తారంటూ నాని ట్వీట్‌ చేశారు. వివేక్ ఆత్రేయ మునుపటి చిత్రాలకు మంచి మ్యూజిక్ అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికీ స్వరాలు కూరుస్తున్నారు.