Homeసినిమా వార్తలుహై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ తో రాబోతున్న నేచురల్ స్టార్.!!

హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ తో రాబోతున్న నేచురల్ స్టార్.!!

Nani and director Jeethu Joseph new movie on cards, Nani31 movie details, Nani31 director, Nani new movie, Nani upcoming movie news, Nani30 release date

Nani New Movie Nani31 Details: ఎటువంటి సినీ నేపథ్యంలో లేకుండానే చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి తన సహజమైన నటనతో నాచురల్ స్టార్ గా ఎదిగిన నటుడు నాని. నటించిన ప్రతి సినిమాలో తనదైన నటనతో క్యారెక్టర్ కి ప్రత్యేకమైన గుర్తింపు తేవడమే కాకుండా మంచి బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకున్నాడు నాని. రీసెంట్ గా అతను నటించిన దసరా చిత్రం ఊహించని విధంగా రికార్డు సృష్టించింది. ఎంతో న్యాచురల్ గా తీసిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

Nani New Movie Nani31 Details: నాచురల్ స్టార్ కు పాన్ ఇండియన్ స్టార్ గుర్తింపు తెచ్చిన మూవీ దసరా. ఇందులో నాని నటనకు దేశ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నాని తన 30 వ మూవీ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రకటించిన ఈ మూవీ కు శౌర్యూవ్ డైరెక్షన్ లో శరవేగంగా షూటింగ్ సాగుతోంది. ఏ మూవీ ని డిసెంబర్ 21 న విడుదల చేసే విధంగా మూవీ మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ మార్కెట్ను టార్గెట్ చేసి ఈ సినిమా విడుదలవుతోంది.

హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లడం నానికి (Nani) బాగా అలవాటు. ఈ నేపథ్యంలో త్వరలో దృశ్యం మూవీస్ ఫేమ్ జీతూ జోసెఫ్‌తో (Jeethu Joseph) నాని ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీళ్లిద్దరూ భేటీ అవ్వడం.. ఆ మీటింగ్ లో జోసెఫ్ (Jeethu Joseph) చెప్పిన స్టోరీ పాయింట్ బాగా నచ్చిన నాని చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట .

Nani and director Jeethu Joseph new movie on cards

దీంతో ప్రస్తుతం జీతూ జోసెఫ్ (Jeethu Joseph) స్క్రిప్ట్ రెడీ చేయడంలో బాగా బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ మూవీ ని ఓ బడా నిర్మాణ సంస్థతో కలిసి నాని స్వయంగా నిర్మించే అవకాశం కూడా ఉందని సమాచారం. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న ఈ మూవీ ఓ హై సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.

web title: Nani and director Jeethu Joseph new movie on cards, Nani31 movie details, Nani31 director, Nani new movie, Nani upcoming movie news, Nani30 release date

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY